Politics

దేశంలో అతిపొడవైన సముద్రవంతెన మోడీ చేతుల మీదుగా ప్రారంభం!

దేశంలో అతిపొడవైన సముద్రవంతెన మోడీ చేతుల మీదుగా ప్రారంభం!

వాణిజ్య రాజధాని ముంబయి(Mumbai)లో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ (MTHL)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) శుక్రవారం ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ దీనిని సిద్ధం చేశారు.

మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఎంటీహెచ్‌ఎల్‌కు ‘అటల్‌ సేతు’(Atal Setu)గా నామకరణం చేశారు. రూ.21,200 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా ఈ వంతెనను నిర్మించారు. ముంబయి, నవీ ముంబయిల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతుండగా, కొత్తగా నిర్మించిన వంతెనతో 15- 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తం పొడవు 21.8 కి.మీ.లు కాగా.. 16 కి.మీ.లకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించారు.

దీనికి ముందు మోదీ నాసిక్‌లో మెగా రోడ్‌షోలో పాల్గొన్నారు. 35 నిమిషాల పాటు రెండు కిలోమీటర్లకుపైగా ఈ రోడ్‌ షో కొనసాగింది. శ్రీ కాలారాం మందిరంలో, గోదావరి నది ఒడ్డున ఉన్న రామకుండ్‌ వద్ద పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. రోడ్‌షోలో మోదీ వెంట మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌ ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z