Movies

ప్రభాస్ సినిమాలో విజయ్ అతిథి పాత్రలో నటిస్తున్నారట!

ప్రభాస్ సినిమాలో విజయ్ అతిథి పాత్రలో నటిస్తున్నారట!

‘సలార్‌’తో హిట్టు కొట్టి జోరు మీదున్నారు ప్రభాస్‌. ఇప్పుడీ జోష్‌లోనే ‘కల్కి 2898ఎ.డి’ని పూర్తి చేసేందుకు రంగంలోకి దిగారు. ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కలయికలో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రమిది. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. దీపిక పదుకొణె కథానాయిక. కమల్‌హాసన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ సినిమాలో హీరో విజయ్‌ దేవరకొండ కూడా భాగమైనట్లు సమాచారం. ఆయన ఈ చిత్రంలో అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నారని తెలిసింది. తను ప్రస్తుతం చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ గతంలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ సినిమాల్లో నటించారు. ఇక సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ముస్తాబవుతోన్న ఈ ‘కల్కి..’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంతోష్‌ నారాయణన్‌ సంగీతమందిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z