ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తు.. ఎప్పుడు చీకటి పడుతుందా? ఎప్పుడు తెల్లారుతుందా? అనేది కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఎదురు చూడటమే ఎమ్మెల్యేల పనిగా మారిందన్నారు. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైకాపా నేతలు ఆస్తులు అమ్ముకున్నారని తెలిపారు. బిల్లుల బకాయిల కోసం కాంట్రాక్టర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z