రాష్ట్రం కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు గౌరవం లేకుండా పోయిందన్నారు. కర్నూలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన షర్మిల.. వైకాపా పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేసిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చాక ఒక్కరోజూ పోరాటం చేయలేదు. విభజన హామీలను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేవి.. లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవి. కర్నూల్‌ను న్యాయ రాజధాని చేస్తామన్నారు. ఏమైంది? మన రాష్ట్ర భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. వైఎస్సార్ సంక్షేమానికి.. జగన్ పాలనకు ఏమాత్రం పొంతన లేదు. ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఆ హామీ నెరవేరలేదు. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎన్నడూ?’’ అని షర్మిల ప్రశ్నించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z