చికాగోలోని ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక హిందూ టెంపుల్ అఫ్ గ్రేటర్ చికాగో లామోంట్ ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు హేమంత్ పప్పు, ఎగ్జిక్యూటివ్ టీం స్వప్న పులా, సోమలత యనమందల, మధు ఆరంబాకం, భాను సీరం సమన్వయపరిచారు. ప్రణతి కలిగొట్ల ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగ వ్యవహరించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి జగదీశ్ కానూరు, శ్రీనాథ్ వాసిరెడ్డి, వీరాస్వామి అచంట, హేమచంద్ర వీరపల్లి, రామకృష్ణ కొర్రపోలు, ప్రసాద్ మరువాడ, దిలీప్ రాయలపూడి , గుప్త నాగుబండి, అపర్ణ అయ్యలరాజు, ప్రశాంతి తాడేపల్లి, దీప్తి చిరువూరి, రవి వేమూరి సహకరించారు. పెద్దసంఖ్యలో ప్రవాస తెలుగువారు పాల్గొని, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే సంగీత, నాట్య కార్యక్రమాలతో పాటు, చిత్ర గీత నృత్యాలు, పాటలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. కెకె రెడ్డి, అశోక్ లక్ష్మణ్, సాయి రవి సూరిభొట్ల , రాజ్ పొట్లూరి, రమేష్ నాయకంటి, హేమ కానూరు, కాశి పాటూరి, కృష్ణ మోహన్ చిలమకూరు, రవి కాకర, చిరు గళ్ళ, శ్రీహర్ష గరికపాటి, ఉమా కటికి, శ్రీనివాస్ పెదమల్లు, శ్రీనివాస్ అట్లూరి తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z