Videos

జూదానికి బానిసై ₹15కోట్ల అప్పుల ఊబిలో ఏఈ-CrimeNews-Mar 14 2024

జూదానికి బానిసై ₹15కోట్ల అప్పుల ఊబిలో ఏఈ-CrimeNews-Mar 14 2024

* ఆర్మీ మేజర్‌, 16 మంది జవాన్లపై సుమారు 35 మంది దాడి చేశారు. (Army Major, jawans attacked) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ధాబా యజమానితో సహా నలుగురిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం వెతుకుతున్నారు. పంజాబ్‌లోని రోపార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లడఖ్ స్కౌట్స్‌కు చెందిన మేజర్ సచిన్ సింగ్ కుంతల్, 16 మంది సైనికులు ఆదివారం లాహౌల్‌లో జరిగిన స్నో మారథాన్‌లో పాల్గొని విజయం సాధించారు. అనంతరం తిరిగి వస్తున్న వారు సోమవారం రాత్రి వేళ మనాలి-రోపర్ రహదారిలోని భరత్‌ఘడ్‌ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ‘ఆల్‌పైన్‌ ధాబా’ వద్ద ఫుడ్‌ కోసం ఆగారు. కాగా, ఆహారం తిన్న తర్వాత యూపీఐ ద్వారా బిల్లు చెల్లిస్తామని ఆర్మీ మేజర్‌, జవాన్లు తెలిపారు. అయితే క్యాష్‌ ఇవ్వాలని ధాబా యజమాని డిమాండ్‌ చేశాడు. ఆర్మీ మేజర్‌ ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించడంతో ధాబా యజమాని వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో ధాబాకు చెందిన సుమారు 35 మంది వ్యక్తులు ఆర్మీ మేజర్‌, 16 మంది జవాన్లపై దాడి చేశారు. ముఖంపై పంచ్‌లు ఇవ్వడంతో పాటు కర్రలు, ఇనుప రాడ్లతో వారిని కొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. మరోవైపు ఈ దాడిలో ఆర్మీ మేజర్‌ తీవ్రంగా గాయపడి సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్మీ మేజర్‌, సైనికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాబా యజమాని, మేనేజర్‌తో సహా నలుగురిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* టూరిస్ట్‌ వీసాపై భారత్‌కు వచ్చిన ఉజ్బెకిస్థాన్ మహిళ (Uzbekistan Woman) హోటల్‌ రూమ్‌లో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్‌కు చేరుకుని పరిశీలించారు. ఉజ్బెకిస్థాన్ మహిళను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 37 ఏళ్ల జరీనా నాలుగు రోజుల కిందట టూరిస్ట్ వీసాపై బెంగళూరు చేరుకుంది. శేషాద్రిపురం ప్రాంతంలోని జగదీష్ హోటల్‌లో ఆమె బస చేసింది. కాగా, బుధవారం మధ్యాహ్నం 4.30 గంటలకు హోటల్‌ సిబ్బంది జరీనా రూమ్‌ డోర్‌ తట్టారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో మరో taaLaMతో డోర్‌ తెరిచి చూశారు. బెడ్‌పై ఆమె మరణించి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ హోటల్‌కు చేరుకున్నారు. జరీనాను ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటారని అనుమానించారు. ఆధారాల కోసం ఫోరెన్సిక్ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. జరీనా బస చేసిన రూమ్‌ను నిశితంగా పరిశీలించారు. మరోవైపు బుధవారం జరీనా గదిలోకి ఎవరైనా వెళ్లారా అన్నది తెలుసుకునేందుకు హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌, రిజిస్టర్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. జరీనా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో గురువారం ఉదయం కాల్పుల ఘటన (Shootout) కలకలం రేపింది. కొడిగేహళ్లి (Kodigehalli) ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇద్దరు దుండగులు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో దేవీనగర్‌ (Devinagar)లోని నగల దుకాణం (jewellery shop) వద్దకు వచ్చారు. దుకాణంలో పట్టపగలే చోరీకి యత్నించారు. అయితే నగల దుకాణం యజమాని వారిని అడ్డుకోవడంతో దుండగులు కాల్పులు జరిపారు. మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో దుకాణం యజమానితోపాటు సిబ్బందికి గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం దుండగులు తుపాకీని అక్కడే వదిలి పారిపోయారు. దుండగులు బైక్‌పై పారిపోతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.

* కీసర మండలం మిషన్‌ భగీరథ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ రాహుల్‌.. ఆన్‌లైన్‌ గేమ్స్‌, రమ్మీలాంటి పలు బెట్టింగ్‌ గేమ్స్‌లకు బానిసై సుమారు 15 కోట్ల రూపాయల వరకు అప్పులు చేశాడు. డబ్బుల చెల్లింపులకు తగిన పనులు ఇప్పిస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొన్నాడు. అతని వ్యవహారం ఉన్నతాధికారులకు తెలిసి గుట్టుగా ఆరు నెలల క్రితం సస్పెండ్‌ చేశారు. అతనికి సహకరించిన అదే శాఖలో పని చేసే ఓ అధికారిని సైతం సస్పెండ్‌ అయ్యాడు. మిషన్‌ భగీరథ ఏఈగా పని చేసే రాహుల్‌ కాంట్రాక్టర్లకు పనులు ఇప్పిస్తానని నమ్మించి దాదాపు 37 మంది నుంచి సుమారుగా 15 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు తీసుకున్నాడు. బాధితులు అతనిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో అతనిపై కీసర పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్న అతను సోమవారం పరాయి దేశం పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులకు దొరికిపోయాడు. అతన్ని సోమవారం రాత్రి కీసర పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. రాహుల్‌ భార్య, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్లు కొందరికి మాట ఇచ్చినా డబ్బు మాత్రం ఇవ్వడం లేదని బాధితులు పోలీసులకు తెలిపారు.

* ప్రణీత్‌రావు ప్రాథమిక విచారణలో సంచలనాలు తెరపైకి వచ్చాయి. ప్రణీత్ రావు అరెస్టుపై డీసీపీ విజయ్ కుమార్ స్పందించారు. విచారణలో ప్రణీత్‌రావు నేరం అంగీకరించారని తెలిపారు. ప్రణీత్‌రావు పాటు మరికొందరు కలిసి ఎస్ఐబి ఆఫీసులో ఉన్న డేటా ధ్వంసం చేశారని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రహస్యంగా పలువురు ప్రముఖుల ప్రొఫైల్స్‌ను మానిటర్ చేశారని తెలిపారు డీసీపీ. ప్రణీత్‌రావుతో పాటు మరికొందరు కుట్రపూరితంగా వ్యవహరించారని.. కొంతమందితో కలిసి రికార్డ్స్ లో ఉన్న డేటాను తన పర్సనల్ డ్రైవ్‌లో కాపీ చేసుకున్నారని చెప్పారు. తర్వాత కార్యాలయంలో ఉన్న కంప్యూటర్‌లతో పాటు ఎస్‌ఐబిలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. తనతోపాటు మరికొందరి లబ్ది కోసమే ప్రణీత్ డేటా ధ్వంసం చేశాడని వెల్లడించారు డీసీపీ. ప్రణీత్‌ స్టేట్‌మెంట్‌ ద్వారా రిటైర్డ్‌ ఆఫీసర్‌ని విచారించబోతున్నారు పోలీసులు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z