Fashion

అనంతపురం జిల్లాలో మొదలైన వజ్రాల వేట

అనంతపురం జిల్లాలో మొదలైన వజ్రాల వేట

వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది. శుక్రవారం రాత్రి వర్షం కురవడంతో శనివారం ఉదయం పొలాలన్ని వజ్రాలు వెతికే వారితో నిండిపోయాయి. ఇక్కడ దొరికే చిన్న రాయి(వజ్రానికి)కి పెద్ద మొత్తంలో నగదు లభిస్తుంది. దాంతో కడప, మదనపల్లి, ధర్మవరం, ఆలూరు, చిప్పగిరి, గుంతకల్లు, గుత్తి ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వజ్రాలను వెతుకుతారు. రాయిని గుర్తు పట్టడానికి వీలుగా కొందరు వ్యాపారులు పరిసర ప్రాంతాల్లోనే తమ మనుషులను ఉంచుతారు. జూన్, జులైలో కురిసే వర్షాలకు జనంతోపాటు ఉద్యోగులు సైతం రాళ్లను వెతకడానికి వస్తుంటారు. దాంతో పొలాలన్నీ జనంతో నిండిపోతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z