Business

యాపిల్‌ను దాటేసిన NVIDIA-BusinessNews-June 06 2024

యాపిల్‌ను దాటేసిన NVIDIA-BusinessNews-June 06 2024

* మారుతీ సుజుకీ (Maruti Suzuki) నెక్సా లైనప్‌లో తీసుకొచ్చిన మోడళ్లపై పెద్దఎత్తున డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇన్విక్టో మినహా అన్ని వాహనాలపై రాయితీ ఇస్తోంది. కొన్ని వాహనాలపై ఏకంగా రూ.74 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. వివిధ మోడళ్లపై ఎక్స్ఛేంజ్‌ బోనస్‌లు, నగదు తగ్గింపులు, కార్పొరేట్‌ ప్రయోజనాలు కూడా అందిస్తోంది. జూన్‌ చివరి వరకు మాత్రమే ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. వేరియంట్లు, ట్రిమ్‌ల బట్టి ఈ ప్రయోజనాలు మారొచ్చు.

* దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (Stock market) వరుసగా రెండోరోజూ రాణించాయి. మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుండడం ఇందుకు నేపథ్యం. ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారిన తెదేపా, జేడీయూ ఎన్డీయేకు భేషరుతుగా మద్దతు తెలపడంతో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు లాంఛనం కానుంది. ఈనేపథ్యంలో పుంజుకున్న సూచీలు లాభాలతో కళకళలాడాయి. సెన్సెక్స్‌ మళ్లీ 75 వేల మార్కు దాటింది. సెన్సెక్స్‌ ఉదయం 75,078.70 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 75,297.73 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 692.27 పాయింట్ల లాభంతో 75,074.51 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 201.05 పాయింట్ల లాభంతో 22,821.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.49గా ఉంది. సెన్సెక్స్‌లో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, ఎన్టీపీసీ షేర్లు లాభపడగా.. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధరర 78.70 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు ధర 2,379 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

* ప్రపంచలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా (Nvidia) అవతరించింది. దాని మార్కెట్‌ విలువ బుధవారం నాటి ట్రేడింగ్‌లో 5 శాతం పెరిగింది. దీంతో ఒక్కో షేరు ధర 1,224 డాలర్లకు చేరింది. దీంతో కంపెనీ విలువ 3 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇప్పటి వరకు ప్రపంచంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచిన యాపిల్‌.. ఇప్పుడు తృతీయ స్థానంలోకి చేరింది. ఎన్విడియా కంపెనీ జూన్‌ 7 తేదీన షేర్లను విభజించేందుకు సిద్ధమైంది. దీంతో మార్కెట్లో కంపెనీ షేర్ల విలువ గణనీయంగా పెరిగింది. 2007లో ఐఫోన్‌ విక్రయాలు మొదలైన నాటి నుంచి అమెరికా మార్కెట్లలో యాపిల్‌ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఎన్విడియా దాని స్థానాన్ని ఆక్రమించింది. 2024లో కంపెనీ షేరు విలువ 147శాతం పెరిగింది. అత్యాధునిక ప్రాసెసర్లకు డిమాండ్‌ గణనీయంగా వృద్ధి చెందడమే దీనికి కారణం. మైక్రోసాఫ్ట్‌, మెటా ప్లాట్‌ఫామ్స్‌, ఆల్ఫాబెట్‌ వేగంగా ఏఐను విస్తరిస్తుండటమే దీనికి కారణం. మే 22 నుంచి దీని స్టాక్‌ విలువ దాదాపు 30శాతం పెరిగింది. బుధవారం ట్రేడింగ్‌ ముగిసే నాటికి ఎన్విడియా విలువ 3.004 ట్రిలియన్‌ డాలర్లుగా.. యాపిల్‌ విలువ 3.000 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ కొనసాగుతోంది.

* ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గడం.. సంస్కరణల అమలుకు సవాల్‌గా మారిందని ప్రముఖ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీలు బుధవారం అభిప్రాయపడ్డాయి. 2014, 2019 ఎన్నికల్లో కేంద్రం లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత సీట్లను బీజేపీ గెల్చుకున్న విషయం తెలిసిందే. నాడు 282, 303 చొప్పున పార్లమెంట్‌ స్థానాలను బీజేపీ నెగ్గింది. అయితే ఈ దఫా (2024) ఎన్నికల్లో మాత్రం సీన్‌ రివర్సైంది. 400 పార్లమెంట్‌ స్థానాలు లక్ష్యంగా బరిలోకి దిగిన మోదీ సర్కారుకు ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు. 240 సీట్లకే కాషాయ దళాన్ని పరిమితం చేశారు. ఫలితంగా లోక్‌సభ (543)లో మ్యాజిక్‌ ఫిగర్‌ (272)ను అందుకోవాలంటే ఎన్డీయే కూటమిలోని మిత్ర పక్షాల మద్దతు తప్పనిసరైంది. బీజేపీ, భాగస్వామ్య పక్షాలకు కలిపి 293 సీట్లు వచ్చిన సంగతి విదితమే. దీంతో ప్రతీ విషయంలో ఇక అందరినీ కలుపుకొనిపోవాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. ఇన్నాళ్లూ ఒంటెత్తు పోకడతో దుందుడుకు నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కారు.. ఇకపై ఆచితూచి అడుగులు వేయాల్సిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్కరణల అమలు, పాలసీ నిర్ణయాలు చకచకా జరిగేలా లేవని, గతంతో పోల్చితే ఆలస్యమవుతాయని ఫిచ్‌ రేటింగ్స్‌, మూడీస్‌ అంచనాకొస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z