Health

గొంతులో 8ఏళ్లుగా పావలా బిళ్ల. ఎట్టకేలకు తొలగింపు.

గొంతులో 8ఏళ్లుగా పావలా బిళ్ల. ఎట్టకేలకు తొలగింపు.

ఒక వ్యక్తి శ్వాసనాళంలో 25 పైసల నాణెం (25 Paise Coin Stuck) చిక్కుకుంది. ఎనిమిదేళ్లుగా అక్కడ ఉండిపోయింది. చివరకు దీనిని గుర్తించిన డాక్టర్లు సర్జరీ ద్వారా ఆ నాణేన్ని బయటకు తీశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల వ్యక్తి విండ్‌పైప్‌లో 25 పైసల నాణెం చిక్కుకోవడంతో ఏళ్లుగా ఇబ్బంది పడ్డాడు. బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)లోని సుందర్‌లాల్ హాస్పిటల్‌ డాక్టర్లు దీనిని గుర్తించారు. 8 ఏళ్లుగా ఆ నాణెం శ్వాసనాళంలో చిక్కుకున్నట్లు తెలిసి షాక్‌ అయ్యారు. కార్డియో-థొరాసిక్ సర్జన్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ లఖోటియా, ప్రొఫెసర్ ఎస్‌కే మాథుర్ నేతృత్వంలోని వైద్యుల బృందం మంగళవారం 20 నిమిషాల పాటు సర్జరీ చేశారు. వ్యక్తి శ్వాసనాళంలో చిక్కుకున్న 25 పైసల నాణేన్ని సురక్షితంగా బయటకు తీశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z