ముంబైలోని చెంబూర్ ఏరియాలో సరితా సల్దాన్హా అనే మహిళ నివసిస్తున్నది. ఆమె ఓ దేశవాలీ కుక్కను పెంచుకుంటుంది. దానికి టైగర్ అనే పేరు పెట్టింది. పోయిన నెల టైగర్ పుట్టినరోజును సరిత ఘనంగా నిర్వహించింది. పుట్టిన రోజు సందర్భంగా టైగర్ ఖరీదైన గిఫ్ట్ బహూకరించింది. స్థానికంగా ఉన అనిల్ జ్యుయెలరీ దుకాణానికి టైగర్‌ను తీసుకెళ్లి ఓ బంగారు గొలుసు కొనుగోలు చేసింది. మూడున్నర తులాల బరువున్న బంగారు గొలుసును సరితా సల్దాన్హా ఏకంగా రూ.2.5 లక్షలు వెచ్చించి కొన్నది. జ్యుయెలరీ షాపులోనే ఆ గొలుసును కుక్క మెడలో వేసింది. సరిత కుక్క మెడలో గొలసు వేస్తున్న దృశ్యాలను సరితా జ్యుయెలరీ సిబ్బంది వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z