* గుండెలపై ఎత్తుకొని ఆడించిన తండ్రి పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు. తన చేతికి మట్టి అంటకుండా సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సంచలనం సృష్టించిన హత్యకేసు చిక్కుముడిని పోలీసులు ఛేదించారు. రియల్టర్ కమ్మరి కృష్ణను అతడి కుమారుడే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధరించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు మొదటి భార్య కుమారుడని పోలీసులు తెలిపారు. ఆస్తి మొత్తం మూడో భార్యకు రాసిస్తున్నాడనే కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టాడని పేర్కొన్నారు. రూ.25 లక్షల సుపారీ ఇచ్చి ముగ్గురితో హత్య చేయించినట్లు వివరించారు. నిందితుల నుంచి 3 కత్తులు, 2 కార్లు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నామని శంషాబాద్ డీసీపీ రాజేశ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
* కుమార్తెకు మంచి భవిష్యత్తుని ఇవ్వాల్సిన ఓ తండ్రి ఆమె పట్ల కసాయిలా ప్రవర్తించాడు. కుమార్తె వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తున్నాడంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్ణాటక (Karnataka)లో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉడుపికి చెందిన ఓ వ్యక్తి కుమార్తె (18 ఏళ్లు) సమీప బంధువైన ఒక కుర్రాడిని ఇష్టపడింది. వీరి ప్రేమ వ్యవహారం యువతి తండ్రికి ఇష్టం లేదు. ఈ విషయంపై కుమార్తెను రోజు వేధింపులకు గురిచేసే వాడు. అడ్డొచ్చిన తల్లిని చావ బాదేవాడు. ఒక రోజు ఆ యువకుడిని ఇంటికి పిలిచి చేయి చేసుకున్నాడు. అతడి ఫోన్లో ఉన్న యువతి వ్యక్తిగత వీడియోలను బలవంతంగా తీసుకున్నాడు. అంతటితో ఊరుకోకుండా ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
* నార్సింగి పరిధిలోని బైరాగీగూడలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆర్క్ అద్వైత అనే అపార్ట్మెంట్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తులో ఉన్న ఓ ఇంటి బెడ్రూంలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఇంట్లో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బుల్లెట్ వేగానికి కిటీకి అద్దం పగిలిపోయింది. అయితే ఆ సమయంలో బెడ్రూంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బెడ్రూంలో పడ్డ బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ కారణంగానే ఆ బుల్లెట్ ఆర్క్ అద్వైత అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోని బెడ్రూంలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు.
* అపార్ట్మెంట్లోని ఇళ్లలో పని చేసే మహిళ లిఫ్ట్‌లో చిక్కుకుంది. (House Help Stuck In Lift) కాపాడుతుండగా అదుపు తప్పిన ఆమె మూడో అంతస్తు నుంచి కింద పడి మరణించింది. దీంతో బంధువులు ఆమె మృతదేహంతో నిరసన చేశారు. రాజస్థాన్‌లోని కోటాలో ఈ సంఘటన జరిగింది. శ్యామ్నగర్లో నివాసం ఉంటున్న 43 ఏళ్ల రుక్మిణిబాయి ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్‌లోని ఇళ్లలో ఇంటి పనులు చేస్తున్నది. గురువారం మధ్యాహ్నం తన ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కింది. అయితే విద్యుత్ సరఫరాలో లోపం వల్ల లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో సుమారు 45 నిమిషాలు అందులో ఆమె చిక్కుకుంది. కాగా, మూడో అంతస్తులో నివసించే కొందరు మహిళలు లిఫ్ట్‌లో చిక్కుకున్న రుక్మిణిబాయి అరుపులు విన్నారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అదుపుతప్పిన పనిమనిషి మూడో అంతస్తు నుంచి కింద పడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు అపార్ట్మెంట్ యజమానుల నిర్లక్ష్యం కారణంగా రుక్మిణిబాయి చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. శుక్రవారం ఆర్కే పురం పోలీస్‌స్టేషన్ వద్ద మృతదేహంతో నిరసనకు దిగారు. పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు హామీ ఇ్వవడంతో శాంతించారు. పనిమనిషి కుటుంబం ఫిర్యాదుతో అపార్ట్మెంట్ బిల్డింగ్‌లోని ముగ్గురు ఇంటి ఓనర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
* రైలులో (Train) నుంచి కింద పడిన భార్యను కాపాడబోయిన భర్త మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా చిరూరుకు చెందిన సయ్యద్ ఆసిఫ్, అసియాబాను దంపతలులు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఫుట్‌బోర్డుపై కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లా ఎర్రగంట్ల వద్ద నిద్రమత్తులో ఉన్న అసియాబాను రైలులో నుంచి కిందపడిపోయింది. గమనించిన సయ్యద్.. ఆమెను కాపాడేందుకు రైలులో నుంచి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. అయితే అసియాబాను మాత్రం తీవ్రగాయాలతో బయటపడింది. ఆమెను చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, నాలుగు నెలల క్రితమే వారు ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు గుంటూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు చెప్పారు.
* భారత్‌కు చెందిన నిరుద్యోగ యువతను ఉద్యోగం పేరుతో కాంబోడియా పంపించి మోసాలు చేయిస్తోన్న కీలక నిందితుడిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలో షాదాబ్ అలాంను అరెస్టు చేసిన పోలీసులు నగరానికి తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా చంచల్‌గూడ జైలుకు తరలించారు. సిరిసిల్లకు చెందిన బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిరిసిల్ల పోలీసులు గతంలో ఏజెంట్ సాయిప్రసాద్, దిల్లీకి చెందిన మరో ఏజెంట్ అన్సారీని అరెస్టు చేశారు. దుబాయ్‌లో ఉండి చైనీయులకు సహకరిస్తున్న షాదాబ్ దిల్లీకి వచ్చినట్టు తెలుసుకుని అరెస్టు చేశారు. దుబాయ్‌లో ఉంటున్న షాదాబ్.. కాంబోడియా దేశంలో చైనీయుల కోసం పనిచేస్తున్న దీపు అనే వ్యక్తికి ఏజెంటుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చాలా మంది యువతను మోసం కాంబోడియా పంపినట్టు గుర్తించారు. మే 16న సిరిసిల్ల పీఎస్‌లో నమోదైన ఈ కేసు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి బదిలీ అయింది.
* హైదరాబాద్ నుంచి యాత్రికులతో బయలుదేరి ఒడిశా వెళ్లిన ఓ బస్సు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక ప్రాంతానికి 23 మంది తీర్థయాత్ర నిమిత్తం ఒడిశా వెళ్లారు. బరంపురం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బస్సును మరో ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను ఉదయ్‌సింగ్, క్రాంతిభాయ్, ఉప్పలయ్యగా గుర్తించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z