WorldWonders

7న ప్రేమ వివాహం. 9న గొడవ కారణంగా దుర్మరణం.

7న ప్రేమ వివాహం. 9న గొడవ కారణంగా దుర్మరణం.

కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని చంబరసనహళ్లి గ్రామానికి చెందిన నవీన్‌ (26), లిఖిత (22)లు ప్రేమించుకున్నారు. పెద్దల సమక్షంలో ఆగస్టు 7న స్థానిక కల్యాణ మండపంలో వీరి వివాహం జరిగింది. అనంతరం నూతన దంపతులు తమ బంధువులతో కొద్దిసేపు సరదాగా గడిపారు. సాయంత్రం వేళ.. లిఖితతోపాటు ఆమె తల్లిదండ్రులను అదే గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి నవీన్‌ తీసుకెళ్లాడు. ఓ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నూతన దంపతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో లిఖితపై నవీవ్‌ కత్తితో దాడి చేశాడు. అరుపులు విన్న కుటుంబీకులు వచ్చి చూడగా.. అప్పటికే లిఖిత రక్తపు మడుగులో పడి మృతిచెందింది. నవీన్‌ కూడా తీవ్ర గాయాలపాలవడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం పెళ్లికుమారుడు కూడా మృతి చెందాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నవీన్‌, లిఖితను ఇష్టపూర్వకంగానే పెళ్లిచేసుకున్నట్లు వెల్లడించారు. అయితే, దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z