అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాంస్కృతిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కళాకారుల ప్రతిభ వెలికితీసేందుకు ఆగస్టు 3వ తేదీన చికాగోలో “తానా కల్చరల్ కాంపిటీషన్ 2024” నిర్వహించారు. తానా కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమా కటికి(ఆరమండ్ల) పర్యవేక్షణలో తొలిసారిగా ఈ పోటీలు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బోలింగ్‌బ్రోక్ మేయర్ మేరి అలెగ్జాండర్ బాస్టా (Bolingbrook Mayor Mary Alexander Basta) హాజరయ్యారు. పోటీల్లో పాల్గొన్న కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమానికి ప్రణతి త్రిపుర యాంకర్‌గా వ్యవహరించారు. వాయిస్ ఆఫ్ తానా –మిడ్‌వెస్ట్, తానా అల్టిమేట్ ఛాంపియన్స్ – మిడ్‌వెస్ట్, తానా డ్యాన్స్ జోడి –మిడ్‌వెస్ట్ పోటీల విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
ఈ పోటీలను నవంబర్ 1వ తేదీ వరకు రీజియన్ల వారీగా నిర్వహిస్తామని, 2వ తేదీన ఉత్తర కరోలినాలోని ర్యాలీలో తుదిసమరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వాలంటీర్లుగా గౌరీ శంకర్ అద్దంకి, రాధిక గరిమెళ్ల , శ్రీదేవి దొంతి, లక్ష్మి బెల్లంకొండ, శాంతి లక్కంసాని, స్వాతి బండి, అనీష్ బెల్లంకొండ, సుహాసిని రెబ్బా, సురేఖ నాదెళ్ల, గురుప్రీత్ సింగ్, వైష్ణవి, ఇందు, శిరీష చిగురుపాటి, జయశ్రీ లక్ష్మణన్, , శ్రీదేవి మల్లంపల్లి. సురేష్ ఇనపూడి, ప్రభాకర్ మల్లంపల్లి, వీరబ్రహ్మం ఆదిమూలంకి వ్యవహరించారు.
గీతాలాపన (శాస్త్రీయ, జానపద, సినిమా), నాట్యం పోటీలను 0–9, 10–14, 15–25 ఏళ్ల విభాగంలో నిర్వహిస్తామని తెలిపారు. 25 ఏళ్లు పైబడిన వారికి డ్యాన్స్‌లో జోడీ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భార్య-భర్తలు మాత్రమే పాల్గొనే అవకాశం కల్పించారు. పాటల పోటీల్లో విజేతలకు వాయిస్ ఆఫ్ తానా అవార్డు, డ్యాన్స్‌లో తానా అల్టిమేట్ డాన్స్ ఛాంపియన్ అవార్డు ఇవ్వనున్నారు. జోడీ డ్యాన్స్‌లో తానా డ్యాన్స్ జోడీ అవార్డు ఇవ్వనున్నట్లు ఉమా వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z