* సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ బిన్ మొహసేన్ షారీ.. భారీ దేహంతో నానా అవస్థలు పడేవాడు. 2013లో 610 కేజీల బరువు పెరిగాడు. దాంతో మూడేళ్లపాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. తన పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి దిగజారిపోయాడు. ఖలీద్ స్టోరీ విన్న మునుపటి సౌదీ రాజు అబ్దుల్లా.. అతడి ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్నాడు. తన సొంత డబ్బుతో ఖలీద్‌కు వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. ప్రత్యేకంగా ఒక బెడ్ డిజైన్ చేయించారు. అలాగే అతడిని రియాద్‌లోని కింగ్ ఫాహద్ మెడికల్ సిటీకి తరలించారు. 30 మంది వైద్యులు ఎప్పటికప్పుడు అతడికి చికిత్స అందిస్తూ..ఒక డైట్ ఛార్ట్‌ను సిద్ధం చేశారు. గ్యాస్ట్రిక్ బైపాప్ సర్జరీ చేశారు. శరీరంలో కదలికలను పునరుద్ధరించేందుకు వ్యాయామాలు చేయించేవారు. ఫిజియోథెరపీ నిర్వహించేవారు. దాంతో ఆరు నెలల్లో సగానికి సగం బరువు తగ్గాడు. ఇక 2023లో 542 కేజీలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. దాంతో 600 కేజీలున్న వ్యక్తి కాస్తా 60 కేజీల ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. అదనపు చర్మం తొలగింపు కోసం శస్త్ర చికిత్సలు అవసరమయ్యాయి. సరికొత్త రూపు సంతరించుకున్న ఆయన్ని ఇప్పుడు అంతా స్మైలింగ్ మ్యాన్ అంటూ పిలుస్తున్నారు. భారీకాయుడైన ఖలీద్.. నాజూకు వ్యక్తిగా మారిన క్రమాన్ని గమనించిన వైద్య సిబ్బంది ఆయనకు ఆ పేరుపెట్టారు.
* ప్రముఖ హీరో ఎన్టీఆర్ (ణ్టృ)కు తీవ్ర గాయాలయ్యాలంటూ బుధవారం ఉదయం వార్తలొచ్చాయి. దీనిపై నటుడి టీమ్ స్పందించి ఆ వార్తలను ఖండించింది. ఆయన సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. ‘‘జిమ్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమ చేతికి రెండు రోజుల క్రితం స్వల్ప గాయమైంది. అయినప్పటికీ ఆయన ‘దేవర’ షూటింగ్‌లో మంగళవారం పాల్గొన్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయకు పెద్ద ప్రమాదం జరిగినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. దయచేసి ఆ ప్రచారాన్ని నమ్మకండి’’ అని విజ్ఞప్తి చేసింది.
* తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ (ఆభిషెక్ ంఅను శింఘ్వి)ని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కె.కేశవరావు రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.
* ఏపీ వ్యాప్తంగా పంద్రాగస్టు నుంచి అన్న క్యాంటీన్‌లు ప్రారంభం. అన్న క్యాంటీన్‌లకు ఎన్టీఆర్ మెమోరియల్‌ట్రస్ట్ తరఫున సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రూ.కోటి విరాళం. మున్సిపల్‌శాఖమంత్రి నారాయణకు చెక్కు అందజేసిన భువనేశ్వరి.
* రష్యా దాడులను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్.. ఇటీవల తన దూకుడును పెంచినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రష్యాలోని కొంత భాగం తమ ఆధీనంలోకి తీసుకుంది. వెయ్యి కి.మీ మేర రష్యా భూభాగాన్ని ఆక్రమించినట్లు పేర్కొన్న ఉక్రెయిన్.. కర్స్క్ ప్రాంతంలో మరింత ముందుకు సాగుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. మరోవైపు యుద్ధం తీవ్రత దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో ఉన్న తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని మాస్కోలోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది.
* ప్రకాశం జిల్లా ఒంగోలులో వైకాపాకు బిగ్ షాక్ తగిలింది. నగర మేయర్ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెదేపాలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
* భాజపా ఎంపీ బాన్సురీ స్వరాజ్‌కు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ ఆప్ నేత సోమనాథ్ భారతి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ మన్‌మిత్ ప్రీతమ్ సింగ్ అరోడా 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ బాన్సురీకి నోటీసులు జారీ చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బాన్సురీ స్వరాజ్ న్యూదిల్లీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. బాన్సురీ స్వరాజ్ కేంద్ర మాజీ మంత్రి, భాజపా దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె.
* కండీషన్ బెయిల్ మాదిరి ఐపీఎస్ అధికారులు రోజూ డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాల్సి రావడం దురదృష్టకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ప్రజల్ని, తమను ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
* మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు అగ్రిగోల్డ్ వ్యవహారంలో అరెస్టవ్వడంలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. వైకాపా ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటని అన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వానికి కక్ష సాధించాలని ఉంటే వైకాపా నేతలు బయటికి వచ్చి ఈ విధంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. చట్టానికి ఓసీ, బీసీ అని ఉండదన్నారు. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న తమ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని అగ్రిగోల్డ్ ఫిర్యాదు మేరకే విచారించి చర్యలు తీసుకున్నారని తెలిపారు.
* కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో తెదేపా నేత, మాజీ మాజీ సర్పంచి వాకిటి శ్రీనివాసులును వైకాపా మూకలు దారుణంగా హత్య చేశాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఎన్నికల్లో తెదేపా తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లలో కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో తిరస్కరణకు గురైనా జగన్ అండ్ కో తమ పాత పంథాను మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావించకూడదన్నారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వైకాపా మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెదేపా అండగా నిలుస్తుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
* 15 రోజుల విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ రెండో రింగ్‌రోడ్డు ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు ద్వారా సెమీ అర్బన్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.
* స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ (ంహా).. పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను ప్రకటించింది. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకం ఒకరిని వరించింది. అది కూడా తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం విశేషం.
* టీమ్ఇండియా బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సెప్టెంబరు 1 నుంచి మోర్కెల్ కాంట్రాక్ట్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది.
* థాయ్‌లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆ దేశ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్‌ను అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z