Agriculture

ఖమ్మంలో భూమికోసం పరస్పర రాళ్లదాడి-CrimeNews-Aug 27 2024

ఖమ్మంలో భూమికోసం పరస్పర రాళ్లదాడి-CrimeNews-Aug 27 2024

* ఖమ్మం జిల్లా కేంద్రంలోని లింగయ్య నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. కొంతకాలంగా స్థిరాస్తి వ్యాపారులు, నిర్వాసితులకు మధ్య వివాదం కొనసాగుతోంది. మంగళవారం జేసీబీలతో గుడిసెలు తొలగించేందుకు స్థిరాస్తి వ్యాపారుల అనుచరులు యత్నించారు. వారిని నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. రాళ్లదాడిలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఐదేళ్లుగా స్థానికంగా ఉంటున్నామని భూదాన్‌ నిర్వాసితులు చెబుతున్నారు.

* ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తన దుకాణానికి వచ్చే పిల్లలకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడో దుర్మార్గుడు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో తీసి డబ్బులు తీసుకురావాలంటూ బెదిరించాడు. కొన్నేళ్లుగా సాగుతున్న అతడి ఆగడాలకు సంబంధించి ఓ వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ విషయం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

* అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో దారుణం చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య వివాదం తీర్చేందుకు వెళ్లిన చిన్నాన్న హత్యకు గురయ్యాడు. జోగి నాయుడు అనే వ్యక్తిని తన అన్న కుమారుడు గనిశెట్టి దొరబాబు కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

* సంగారెడ్డి జిల్లా కంకోల్‌ చెక్‌పోస్టు వద్ద 83.4 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏవోబీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. చిత్తూరు జిల్లాకు చెందిన నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈ గంజాయి విలువ రూ.33.50 లక్షలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ కారులో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. క్షుణ్నంగా పరిశీలించగా.. సీట్ల కిందిభాగంలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక పెట్టెలో గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

* తండ్రికి ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చూపించేందుకు తోడుగా వచ్చిన కూతురు..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్ల ముందే దుర్మరణం పాలైన హృదయ విదారక సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చెంగిచెర్లకు చెందిన మేడా శంకర్‌రావు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సోమవారం సోమాజిగూడలోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఆసుపత్రిలో ఎండోస్కోపీ చేయించుకునేందుకు శంకర్‌రావు తన కూతురు ప్రసన్న(25)ను తీసుకుని బైక్‌పై బయలుదేరాడు. ఉదయం 7:45 ప్రాంతంలో గ్రీన్‌ల్యాండ్స్‌ కూడలి వద్దకు చేరుకోగా వీరి బైకును వెనకనుండి అతివేగంగా వచి్చన టెంపో ఢీకొట్టింది. దీంతో శంకర్‌రావు, ప్రసన్న ఇద్దరూ కిందపడిపోయారు. శంకర్‌రావుకు హెల్మెట్‌ ఉండడంతో స్వల్పగాయాలతో బయట పడగా..ప్రసన్న కిందపడగానే తలకు తీవ్ర గాయమై అపస్మారకస్థితిలోకి వెళ్లి మృతి చెందింది. కళ్ల ముందే కూతురు మృతిచెందడంతో శంకర్‌రావు కన్నీరుమున్నీరుగా విలపించాడు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రమాదానికి కారణమైన మహబూబ్‌నగర్‌ జిల్లా, కొల్లాపూర్‌కు చెందిన టెంపో డ్రైవర్‌ సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z