ప్రసాదం అనగానే ఎవరికైనా లడ్డూనే గురొస్తుంది.. తిరుమల శ్రీవారి ప్రసాదమే దీనికి నిదర్శనం.. ఆ ప్రసాదానికి అంత పవిత్రత, మహిమ ఉంది. ఆ తర్వాత అమృతతుల్యం లాంటి ప్రసాదం అన్నవరం ప్రసాదమే.. గోధుమనూకతో తయారుచేసే ఈ ప్రసాదానికి అంతే ప్రాముఖ్యత ఉంది. సంప్రదాయం.. పవిత్రత మేళవింపుతో విస్తరాకులో వచ్చే కమ్మదనం భక్తుల నోరూరిస్తుంది.. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. సత్యదేవుని దర్శనానికి వచ్చినవారు కనులపండువగా ఆ స్వామిని గాంచిన తర్వాత ప్రసాదం కోసం క్యూ కడతారు. చేతిలోకి తీసుకున్న తర్వాత కళ్లకు అద్దుకుని ఆర్తిగా ఆరగిస్తారు. అలాంటి అమృతతుల్యమైన దీనికి భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) గుర్తింపు తాజాగా లభించింది. దేశంలోనే ప్రామాణికమైన ఈ సంస్థ గుర్తింపుతో ప్రసాదానికి మరింత పేరుప్రఖ్యాతలు లభించినట్లయింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z