Devotional

Horoscope in Telugu – Sep 07 2024

Horoscope in Telugu – Sep 07 2024

మేషం
శుభసమయం. సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

వృషభం
కీలక వ్యవహారాలలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

మిథునం
మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవరినీ నమ్మకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

కర్కాటకం
దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఎల్లవేళలా ఉంటుంది. శని ధ్యానం శుభదాయకం.

సింహం
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనఃశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం శ్రేయస్కరం.

కన్య
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మీ మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

తుల
మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం
చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. శ్రీ రామ నామాన్ని జపించడం శుభకరం.

ధనుస్సు
బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమ్తతంగా ఉండాలి. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.

మకరం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ దర్శనం శుభకరం.

కుంభం
స్థిరమైనబుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన చేయడం మంచిది.

మీనం
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పూర్తి చేయాల్సిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారు ఉన్నారు జాగ్రత్త. గురు శ్లోకాన్ని జపించాలి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z