Food

ఖర్జూర విత్తనాల చూర్ణం తింటే మధుమేహం పరార్

ఖర్జూర విత్తనాల చూర్ణం తింటే మధుమేహం పరార్

డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఖర్జూరాలు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కానీ ఖర్జూరం లోపల ఉండే గింజలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఖర్జూరం విత్తనాలు కొన్ని ముఖ్యమైన పదార్ధాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఖర్జూరంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ రుగ్మతల చికిత్సలో కూడా సహాయపడుతుంది. ఈ విత్తనాలు మంచి జీవక్రియను నిర్వహించడానికి కూడా మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి.

ఖర్జూర గింజలను ఎలా తినాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. ఖర్జూరం తిన్న తర్వాత విత్తనాలను బాగా కడగాలి. ఖర్జూరం గింజలకు అంటకుండా పూర్తిగా కడగాలి. తర్వాత విత్తనాలను కొన్ని రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఎండు గింజలను తీసుకుని పాన్‌లో కాసేపు వేపాలి. ఇప్పుడు చల్లబరచడానికి కాసేపు పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 1/2 టీస్పూన్ గోరువెచ్చని నీటిలో కలుపుకుని, ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే 7 రోజుల్లోనే మంచి ఫలితాలను చూస్తారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z