WorldWonders

యువతి తలపై సీసీటీవీ అమర్చిన తండ్రి

యువతి తలపై సీసీటీవీ అమర్చిన తండ్రి

సాధారణంగా సీసీటీవీ (CCTV) కెమెరాలను ఇళ్లలోనూ, ఆఫీస్‌ల్లోనూ, రోడ్ల మీద, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ అమర్చుతారు. సెక్యూరీటీ కారణాల రీత్యా సీసీటీవీ కెమేరాలన అమర్చుతారు. అయితే పాకిస్తాన్‌ (Pakistan)లోని ఓ వ్యక్తి మాత్రం వెరైటీగా ఆలోచించాడు. తన కూతురి (Daughter) తలపైనే సీసీటీవీ కెమెరాను అమర్చాడు. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. కరాచీకి చెందిన ఆ యువతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తలపై సీసీటీవీ కెమెరా ఎందుకు ఉందో వివరించింది. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆ యువతితో మాట్లాడాడు. తన తలపై సీసీటీవీని తన తండ్రి ఏర్పాటు చేశారని చెప్పింది. “నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నానో ప్రతి విషయం తెలుసుకోవాలని మా నాన్న అనుకున్నారు.“ అని ఆమె చెప్పింది. అందుకు మీరు అభ్యంతరం చెప్పలేదా అని అడిగితే.. ఆమె “లేదు“ అని చెప్పింది. “నా రక్షణ కోసమే మా నాన్న ఈ ఏర్పాటు చేశారు. మా నాన్న నా సెక్యూరిటీ గార్డు. ప్రస్తుతం కరాచీలో పరిస్థితులు చూస్తున్నాం కదా“ అంటూ ఆ యువతి ఆ వీడియోలో పేర్కొంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 1.4 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. “ఇది అంత సర్‌ప్రైజింగ్ ఏమీ కాదు.. పాకిస్తాన్‌లో పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు“, “హై లెవెల్ సెక్యూరిటీ..“, “డిజిటల్ పాకిస్తాన్“, “పాకిస్తాన్‌లోనే ఇలాంటివి సాధ్యం“ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z