Kids

సిద్ధిపేటలో మైనర్ బాలికపై అత్యాచారం-CrimeNews-Sep 09 2024

సిద్ధిపేటలో మైనర్ బాలికపై అత్యాచారం-CrimeNews-Sep 09 2024

* సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్‌ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను దుబ్బాక సర్కిల్‌ కార్యాలయంలో సిద్దిపేట ఏసీపీ మధు వెల్లడించారు. దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది. బాలికకు మాయమాటలు చెప్పి దుబ్బాక మండలానికి చెందిన ఒక యువకుడు, అక్బర్‌పేట-భూంపల్లి మండలానికి చెందిన ఇద్దరు యువకులు దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే మూడు నెలల కిందట బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాలికను ఆమె తల్లి సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. బాలిక గర్భవతి అని తేలింది. దీంతో బాలికను నిలదీయడంతో జరిగిన విషయాన్ని తల్లికి వెల్లడించింది.

* తనకు పెళ్లి కాలేదని ఓ వ్యక్తి 11 నెలల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. కొంతకాలంపాటు ఆమెతో కాపురం చేసిన తరువాత ముఖం చాటేశాడు.అతని గురించి విచారించగా అప్పటికే పెళ్లై బిడ్డలున్నారన్న విషయం తెలిసింది. దీంతో న్యాయం కోసం పలు పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని బాధిత మహిళ తెలిపింది. చివరకు కడప చిన్న చౌక్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కడప కలెక్టరేట్‌ ఆవరణలో విషం తాగడంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమెను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.

* రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుపై మరో కేసు నమోదైంది. కూకట్‌పల్లిలోని ఓ భూమి వివాదంలో కలుగజేసుకున్నారని భుజంగరావుపై ఆరోపణలున్నాయి. కూకట్‌పల్లి ఏసీపీగా ఉన్నప్పుడు తమని బెదిరించారని ఆయనపై కొందరు సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో ఈవోడబ్ల్యూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపడతామని చెప్పారు.

* బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ లక్ష్యంగా పెట్టుకొని యూపీఐ మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు రూ.4కోట్ల మేర యూపీఐ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫిర్యాదుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సైబరాబాద్‌ డీసీపీ నరసింహా తెలిపారు. ఈ యూపీఐ మోసాల వెనుక ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ఉంది. ముందుగా ముఠా సభ్యులు వస్తువులు కొనడానికి ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌కి వెళ్తారు. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తారు. చెల్లింపులు చేయడానికి బజాజ్‌ షోరూమ్‌లోని క్యూఆర్‌ కోడ్‌ను రాజస్థాన్‌లోని సహచరులకు పంపుతారు. అక్కడి నుంచి క్యూఆర్‌ కోడ్‌తో డబ్బులు పంపిస్తారు. ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు డెలవరీ అయ్యాక పొరపాటున వేరే ఖాతాకు డబ్బు బదిలీ చేశామంటూ ఛార్జ్‌ బ్యాక్‌ ఆప్షన్‌ ద్వారా తిరిగి డబ్బు పొందుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z