అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ప్రవాస భారతీయులు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి వేడుకలు నిర్వహించారు. మహనీయులు ప్రాణత్యాగాలతో సిద్ధించిన స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నామని, వారి స్ఫూర్తి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమాన్ని మాగులూరి భాను ప్రకాష్ సమన్వయపరచారు. మహాత్మా గాంధీ అహింసా మార్గం ద్వారా, శాస్త్రి “జై జవాన్ జై కిసాన్” నినాదం ద్వారా దేశాన్ని ముందుకు నడిపారని వక్తలు కొనియాడారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z