తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా Telugu Alliances of Canada (TACA) ఆధ్వర్యంలో శనివారం నాడు బ్రాంప్టన్ నగరం సాండల్ వుడ్ పార్క్ వే సెకండరి స్కూల్ ఆడిటోరియంలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఉత్తమ బతుకమ్మ బహుమతిని గౌతమి కొండబత్తిని, మౌణిక మరం, సౌజన్య కొంపల్లి, దివ్య ఆడెపు, మౌణిక కందకట్లలు గెలుచుకొన్నారు. ప్రముఖ గాయకురాలు పారిజాత బతుకమ్మ పాటలతో అలరించారు.
అధ్యక్షుడు రమేశ్ మునుకుంట్ల పండుగలో పాల్గొన్న తెలుగువారికి ధన్యవాదాలు తెలిపారు. నవంబరు 2న జరిగే దీపావళి పండుగలో పాల్గొనవలసినదిగా కోరారు. ఉపాధ్యక్షులు రాఘవ్ కుమార్ అల్లం, కార్యదర్శి ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, కోశాధికారి మల్లిఖార్జునాచారి పదిర, సాంస్కృతిక సమన్వయకర్త సంతోష్ కొంపల్లి, డైరక్టర్లు ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, దుర్గా ఆదిత్యవర్మ భూపతిరాజు, విద్య భవణం, ఖజిల్ మొహమ్మద్, యూత్ డైరక్టరు లిఖిత యార్లగడ్డ, యస్వంత్ తేజ కర్రి, ఎక్స్ అఫిసియో సభ్యురాలు కల్పన మోటూరి, ఫౌండెషన్ కమీటీ చైర్మన్ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీబోర్డు చైర్మన్ సురేశ్ కూన, ట్రస్టీలు విద్యాసాగర్ రెడ్డి సారబుడ్ల, శృతి ఏలూరి, వాణి జయంతి, ఫౌండర్లు హనుమంతాచారి సామంతపుడి, శ్రీనాథ్ కుందూరి, మునాఫ్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z