Politics

గుంటూరు జిల్లా భాజపా నేత నగ్న వీడియోల కలకలం-NewsRoundup-Oct 10 2024

గుంటూరు జిల్లా భాజపా నేత నగ్న వీడియోల కలకలం-NewsRoundup-Oct 10 2024

* తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అనుచిత వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున (Nagarjuna) నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. రాజకీయ విమర్శల్లో భాగంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్తావించారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువునష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.

* మంత్రి కొండా సురేఖపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు దీనికి సంబంధించిన పిటిషన్‌ దాఖలు చేశారు. భారాస నేతలు బాల్క సుమన్‌, సత్యవతి రాథోడ్‌, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. ఇటీవల కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సినీరంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు.

* భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు జిల్లాకు చెందిన ఓ నాయకుడి నగ్న వీడియోకాల్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమ పార్టీకి చెందిన మహిళతో ఆయన వీడియోకాల్‌లో మాట్లాడుతూ అందులో నగ్నంగా కనిపించారు. ఈ వ్యవహారం పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్లింది. భాజపా మీడియా వ్యవహారాలు పర్యవేక్షించే నేత ఒకరు దీనిపై విచారణ చేసి.. పార్టీ పెద్దలకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ పార్టీ జిల్లా ముఖ్యనాయకుడి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో పార్టీ ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి నుంచి మరో నేత నగ్న వీడియో బయటికి రావడం మరింత కలకలానికి కారణమైంది. ఆ ఇద్దరు నేతల వీడియోలు బయటకు రావడం వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయమున్నట్లు సమాచారం.

* ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో (Meesho) ఉద్యోగులకు భారీ ఆఫర్ ఇచ్చింది. 9 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. తమ సిబ్బంది రెస్ట్‌ తీసుకొని రీఛార్జ్‌ అయ్యేందుకు ఈ సెలవులు ఇస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ సంస్థ ప్రకటించింది. వరుసగా నాలుగో ఏడాది ఈ తరహా బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపింది. ‘‘9 రోజులపాటు ల్యాప్‌టాప్స్‌ ఉండవు. ఈ మెయిల్స్ రావు. స్టాండప్‌ కాల్స్‌ ఉండవు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు. ఈ ‘రెస్ట్‌ అండ్ రీఛార్జ్’ బ్రేక్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ మూడు వరకు ఉండనుంది. మా మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌ తర్వాత.. పూర్తిగా విశ్రాంతి తీసుకొని, మాపై మేం దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కొత్త ఏడాదికి సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకే ఈ బ్రేక్‌’’ అని మీషో సంస్థ వెల్లడించింది. ఇది చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఈ విధానం ఎంతో సంతోషాన్నిస్తోందంటూ ప్రశంసించారు. సిబ్బంది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంత విలువ ఇస్తున్నారో దీనిని బట్టి తెలుస్తోందని మరికొందరు కామెంట్లు పెట్టారు.

* జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు నేషనల్‌ కాన్ఫరెన్స్‌- కాంగ్రెస్‌ కూటమికి అధికార పీఠాన్ని కట్టబెట్టాయి. ఈ క్రమంలోనే ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా వెల్లడించారు.

* టాటా సన్స్‌ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. సంస్థను 4 బిలియన్‌ డాలర్ల నుంచి 100 బిలియన్‌ డాలర్లు దాటించిన రతన్‌ టాటా (Ratan Tata) కన్నుమూశారు. ఇప్పుడు ఆ సంస్థకు ఎవరు దిక్సూచిగా మారతారనేది చర్చనీయాంశమైంది. టాటా సంస్థలో అత్యంత శక్తిమంతమైన పదవి టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌. గ్రూప్‌లోని సంస్థలు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించి ముందుకు నడిపించడంలో ఈ పదవిది గురుతర బాధ్యత. టాటాసన్స్‌లో 66శాతం షేర్లు ‘శ్రీ దోరబ్జి టాటా’, ‘శ్రీ రతన్‌ టాటా’, ఇతర ట్రస్ట్‌ల అధీనంలోనే ఉన్నాయి. టాటా గ్రూపులో టాటాసన్స్‌ 52శాతం వాటా కలిగిఉంది. ఇక ఈ గ్రూపులో టీసీఎస్‌ అత్యధిక ఆదాయం తీసుకొచ్చే సంస్థ. ఈ ఆర్థిక సంవత్సరం దీనినుంచి రూ.43 వేల కోట్లు లభించాయి. ప్రస్తుతం చంద్రశేఖరన్‌ టాటాసన్స్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన గతంలో టీసీఎస్‌లో కీలక బాధ్యతల నుంచి వచ్చారు. మిస్త్రీ కుటుంబానికి కూడా టాటా గ్రూపులో భారీగా వాటాలున్నాయి.

* ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు, భవానీ మాలధారులు భారీగా తరలివస్తున్నారు. ఐదు వరుసల్లో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యే సుజనాచౌదరి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

* ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ (Rafael Nadal) రిటైర్మెంట్‌ ప్రకటించాడు. నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు.

* దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషన్‌ గ్రహీత, టాటా సన్స్‌ సంస్థ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా భౌతికకాయానికి ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నివాళులర్పించారు. ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లోని పార్థివదేహం ఎదుట పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.

* ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్‌టాటా విలువలు తనపై ఎంతో ప్రభావం చూపాయని ఎయిరిండియా సీనియర్ పైలట్ కెప్టెన్ జోయా అగర్వాల్ (Captain Zoya Agarwal) అన్నారు. తన మనసులో ముద్రించుకుపోయిన ఓ సందర్భాన్ని తాజాగా ఆమె పంచుకున్నారు.

* తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.

* కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రూ.1,78,173 కోట్లు పన్ను వాటాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ముందస్తు వాటాగా రూ.89,086.50 కోట్లతో కలిపి రూ.1,78,173 కోట్లు విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు విడుదల చేసింది.

* తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబురాలు చేసుకుంటున్నారు. మహిళలంతా తీరొక్క పువ్వులతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ సంబురాలతో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలు వెలుగులీనుతున్నాయి. వందలాది మంది మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడిపాడుతున్నారు.

* ష్ట్రంలోని దేవాలయాల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం జీవో నెం. 223 ఉత్తర్వులను జారీ చేయడం అభినందనీయమని శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న వేళ ఉదయం హనుమంతవాహనంపై శ్రీకోదండరాముడి అలంకారం జరుగుతుండగా ఈ శుభపరిణామం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు అర్చకుల తరపున ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z