NRI-NRT

డల్లాస్‌లో నాట్స్ వాలీబాల్‌కు విశేష స్పందన

డల్లాస్‌లో నాట్స్ వాలీబాల్‌కు విశేష స్పందన

నాట్స్ డల్లాస్ విభాగం గాంధీ జయంతి పురస్కరించుకుని వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తి చాటారు.

ఈ టోర్నమెంట్లో తలపడిన జట్లని రెండు విభాగాలుగా విభజించారు. ప్రో కేటగిరీ విభాగంలో విజేతలుగా వాలీ వోల్ఫ్స్ జట్టు, రన్నర్స్ గా వజ్రాస్ జట్టు నిలిచాయి. అడ్వాన్స్డ్ విభాగంలో విజేతలుగా వికింగ్స్ జట్టు నిలవగా, రన్నర్స్ గా వాలీ డూడ్స్ జట్టు నిలిచింది. విజేతలకు, రన్నర్స్ కు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న నాట్స్ నాయకులు బహుమతి ప్రదానం చేశారు.

డల్లాస్ చాప్టర్ క్రీడా కోఆర్డినేటర్లు గౌతమ్ కాశిరెడ్డి, విజయ్ బల్లా, మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, కోఆర్డినేటర్ స్వప్న కాట్రగడ్డ, జాయింట్ కోఆర్డినేటర్ శ్రావణ్ నిడిగంటి తదితరులు పోటీలను సమన్వయపరిచారు. యువతతో కూడిన జట్టులను ప్రత్యేకంగా అభినందించారు. ఆటలో అద్భుత ప్రతిభ కనబరిచిన 8వ తరగతి విద్యార్థి కార్తీక్ ను ప్రత్యేక బహుమతితో అభినందించారు. రవి తాండ్ర, కిషోర్ నారె, డల్లాస్ చాప్టర్ సభ్యులు శ్రీధర్ విన్నమూరి, పవన్ కొతారు, త్రినాథ్ పెద్ది, వంశీ వేణాటి, కావ్య, బద్రి బియ్యపు తదితరులు సహకరించారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి డల్లాస్ విభాగాన్ని అభినందించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z