హైదరాబాదు చంపాపేట్ లోని ప్రభుత్వ మహిళల వికలాంగుల సదనంలోని 30మంది దివ్యాంగులకు క్వాలిటీ మాట్రిక్స్ సంస్థ ప్రైనిధి వల్లేపల్లి ప్రియాంక వీల్ ఛైర్లు అంద్జఏశారు. వికలాంగులకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ₹2లక్షలు ఖర్చుతో దివ్యాంగ మహిళలకు తోడ్పాటు అందజేసిన ప్రియాంకను స్థానిక కార్పొరేటర్, బిజెపి రాష్ట్ర నాయకులు వంగ మసూద్ రెడ్డి సత్కరించి అభినందించారు. అఖిలభారత వికలాంగుల సంస్థ ప్రతినిధి కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ అమెరికాకు చెందిన ప్రియాంక-శశికాంత్ దంపతులు స్వదేశంలో సేవ చేయడం హర్షణీయమని అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z