NRI-NRT

NATS: ఒమాహ విభాగం ప్రారంభం. చికాగోలో బాలల సంబరాలు.

NATS: ఒమాహ విభాగం ప్రారంభం. చికాగోలో బాలల సంబరాలు.

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఓమాహాలో విభాగాన్ని ప్రారంభించింది. ఓమహాలో నాట్స్ చాప్టర్ కో ఆర్డినేటర్‌గా మురళీధర్ చింతపల్లి నియామితులయ్యారు. శ్రీనివాస్ మల్లిపుడి జాయింట్ కో ఆర్డినేటర్, మహిళా సాధికారిత శ్రీదేవి కమ్మ, విరాళాల సేకరణ, సభ్యత్వం ప్రదీప్ సోమవరపు, వెబ్ అండ్ మీడియా శ్రీనివాసరావు, క్రీడలు సత్యనారాయణ పావులూరి, కార్యక్రమాల నిర్వహణ కృష్ణ చైతన్య రావిపాటిలు చేయనున్నారు.

ఓమహా చాప్టర్ సభ్యులు సరికొత్త సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు కోరారు. మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, మెంబర్‌షిప్ నేషనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ బాలినేని, రావు చిగురుపాటి, హిందూ దేవాలయం అధ్యక్షుడు సుందర్ చొక్కర, ప్రొఫెసర్ డాక్టర్ ఫణి తదితరులు పాల్గొన్నారు.

—————–

నాట్స్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా బాలల సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చికాగోలో బాలల సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో 150 మందికి పైగా చిన్నారులు సంస్కృతి, సృజనాత్మకతతో కూడిన ప్రదర్శనలతో తమ ప్రతిభను ప్రదర్శించారు. తెలుగులో ఉపన్యాస పోటీలు, మ్యాథ్ బౌల్, ఆర్ట్ పోటీలు, ఫ్యాన్సీ డ్రస్ ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలతో చిన్నారులు అలరించారు.

చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు-నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, శ్రీనివాస్ ఎక్కుర్తి, ఈశ్వర్ వడ్లమన్నాటి, మహేష్ కిలారు, వీర తక్కెళ్లపాటి, హవేళ, సిరి ప్రియ, భారతి కేశనకుర్తి, చంద్రిమ దాది, కిరణ్మయి గుడపాటి, బిందు, లక్ష్మి, రోజా, మాధురి పాటిబండ్ల, బిందు బాలినేని, రామ్ కేశనకుర్తి, శ్రీనివాస్ పిల్ల, పాండు చెంగలశెట్టి, నవాజ్, గోపి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z