తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA-Telugu Alliances of Canada) ఆధ్వర్యంలో శనివారం నాడు టోరొంటోలోని బ్రాంప్టన్ చింగువాకూసి సెకండరీ స్కూలులో సంక్రాంతి సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. తాకా అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల, కోశాధికారి మల్లిఖార్జునాచారి, ధనలక్ష్మి మునుకుంట్ల, విశారద పదిర, వాణి జయంతి, అనిత సజ్జ, ప్రశాంతి పిన్నమరాజు, అశ్విత అన్నపురెడ్డిలు వేడుకలను ప్రారంభించారు.
కెనడా జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన సాంస్కృతిక వేడుకల్లో ప్రవాస చిన్నారులకు భోగిపళ్లు పోశారు. కెనడా పార్లమెంటు సభ్యులు చంద్రకాంత్ ఆర్య ముఖ్య అతిథిగా పాల్గొని తాకా 2025 కాలెండరును ఆవిష్కరించారు. అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల మాట్లాడుతూ తెలుగు కళలు, పండుగలు, భారతీయ సంసృతి సాంప్రదాయాలను కెనడాలోని తెలుగు వారందరూ కొనసాగిస్తూ ముందు తరాలకు అందజేసేందుకు తాకా చేస్తున్న కృషిలో కెనడాలోని ప్రవాస తెలుగు వారి పాత్ర మరువలేనిదన్నారు. ఫౌండెషన్ కమీటీ చైర్మన్ అరుణ్ కుమార్ లాయం మాట్లాడుతూ తాకా-శ్రీపద్మావతి మహిళావిశ్వవిద్యాలయంతో కలిసి సంగీతం, నాట్యంలో డిప్లోమా, డిగ్రీ కోర్సులను త్వరలో కెనడాలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. హనుమంతాచారి సామంతపుడి సంస్థ కార్యక్రమాలను వివరించారు.
పోటీల్లో గెలిచిన పిల్లలకు జ్ఞాపికలను అందచేశారు. రుచికరమైన తెలుగు భోజనం అలరించింది. రాం జిన్నాల, దాతలకు కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. ఉపాధ్యక్షులు రాఘవ్ అల్లం, డైరక్టర్లు ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, యూత్ డైరక్టర్లు సాయి కళ్యాణ్ వొల్లాల, రాజా అనుమకొండ, ఎక్స్ అఫిసియో సభ్యురాలు కల్పన మోటూరి, ట్రస్టీలు పవన్ బాసని, శ్రీనాథ్ కుందూరి, గిరిధర్ మోటూరి తదితరులు పాల్గొన్నారు. భారత జాతీయ గీతాలాపనతో వేడుకలను ముగించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z