ఆస్టిన్ తానా(TANA) ఆధ్వర్యంలో సెడార్ పార్క్‌లో “రైతు కోసం తానా” కార్యక్రమంలో క్రీడా పోటీలను నిర్వహించారు. తానా సౌత్‌వెస్ట్ ప్రతినిధి సుమంత్ పుసులూరి సమన్వయంలో నిర్వహించినా ఈ పోటీల్లో పెద్దసంఖ్యలో క్రీడాకారులు ఉత్సాహంగా బ్యాడ్మింటన్, పికిల్‌బాల్, టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొన్నారు.
ఆస్టిన్ తానా ప్రతినిధులు చిరంజీవి ముప్పనేని, సూర్య ముళ్ళపూడి, బాలాజీ పర్వతనేని, సాయి మువ్వా, తేజ వుడత, ఉదయ్ మేక, లెనిన్ ఎర్రం, ప్రసాద్ కాకుమాను, శ్రీధర్ పోలవరపు, సదా చిగురుపాటిలు సహకరించారు. విజేతలకు ట్రోఫీలు అందజేశారు. సుమంత్ పుసులూరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషిచేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. సేకరించిన నిధులు రెండు తెలుగు రాష్ట్రాల రైతుల సంక్షేమం కోసం వినియోగించబడతాయని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z