NRI-NRT

హాంగ్‌కాంగ్‌లో సామూహిక సత్యనారాయణ స్వామి పూజ

హాంగ్‌కాంగ్‌లో సామూహిక సత్యనారాయణ స్వామి పూజ

భీష్మ ఏకాదశి నాడు, హాంగ్‌కాంగ్‌లోని హిందూ దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక పూజ వైభవంగా జరిగింది. ఈ వార్షిక ఉత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి బృందం గత దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్నారు. కొత్తగా వివాహం చేసుకున్న జంటల నుండి వృద్ధ దంపతుల వరకు, అనేక మంది ఈ పూజలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నారు. సహకరించిన కార్యవర్గ సభ్యులు, స్వచ్ఛంద సేవకులకు జయ పీసపాటి ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో ఐకమత్యం, యువతరంలో ఆధ్యాత్మికాభివృద్ధికి, చైతన్యాభివృద్ధికి ప్రతీకగా నిలుస్తాయని పూజకు విచ్చేసిన కాన్సుల్ (కాన్సులర్) కె.వెంకటరమణ తమ హర్షం వ్యక్తపరిచారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z