కావలసిన పదార్థాలు
పచ్చిరొయ్యలు: పావు కిలో, గోంగూర: 2 కట్టలు, పచ్చిమిర్చి: 10, ఉల్లిగడ్డలు: 2 (పెద్దవి), ఎండుకొబ్బరి పొడి: పావు కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు: 2 టీస్పూన్లు, గరం మసాలా: ఒక టీస్పూను, కారం: టీస్పూను, పసుపు: అర టీస్పూను, కొత్తిమీర తురుము: కొద్దిగా, నూనె: పావు కప్పు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
స్టవ్ మీద పాన్ పెట్టి తరిగిన గోంగూర, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి నూనె లేకుండా రెండు నిమిషాలు వేయించి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు రొయ్యలు వేసి రెండు నిమిషాలు మూతపెట్టాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి ఐదు నిమిషాలపాటు మూతపెట్టి సన్నటి మంటపై ఉడికించాలి. రొయ్యలు ఉడికిన తర్వాత గోంగూర పేస్టు, ఎండుకొబ్బరి పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర తురుముతో అలంకరించుకోవాలి. నోరూరించే గోంగూర రొయ్యల ఇగురు సిద్ధం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z