ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) గుంటూరు మహిళలకు చేయూతనందించింది. నెహ్రు యువ కేంద్రంలో మహిళలకు కుట్టు శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు కుట్టు మిషన్లను పంపిణి చేశారు. పేద మహిళలు స్వశక్తితో నిలబడేలా..సాధికారత సాధించేలా నాట్స్ సహకరిస్తుందమొ సంస్థ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ బాలినేని అన్నారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నాట్స్ ప్రతినిధులకు, సంస్థకు, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటిలకు మహిళలు ధన్యవాదాలు తెలిపారు.
Register for NATS 8th Sambaralu – https://sambaralu.org/
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z