* జగన్ చుట్టూ కోటరీ ఉందని.. ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaya Sai Reddy) అన్నారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిశాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్‌కు చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సీఐడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు (YS jagan) భవిష్యత్తు ఉంటుంది. జగన్ చుట్టూ కొందరు నేతలు కోటరీగా ఏర్పడ్డారు. జగన్‌ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలి. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మకూడదు’’ అని వ్యాఖ్యలు చేశారు.
* బద్వేలు నియోజకవర్గంలో అన్నదాన సత్రాన్ని కూల్చడం బాధాకరమని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. కాశీనాయన అన్నదాన సత్రం కూల్చివేతపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అటవీ నిబంధనల పేరిట కూల్చడం సరికాదన్నారు. భక్తుల మనోభావాలు గౌరవించి.. కూల్చకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సొంత నిధులతో అదే స్థలంలో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తామని లోకేశ్ చెప్పారు.
* తమ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలోపెట్టుకునే చేశామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. మహిళా సాధికారతను మాటల్లో చెప్పడం కాదని.. చేతల్లో చేసి చూపించాలన్నారు. తెదేపాతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తుచేశారు.
* పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ఘటనలో బలోచ్ వేర్పాటువాదుల చెర నుంచి దాదాపు 190 మంది ప్రయాణికులను భద్రతాబలగాలు రక్షించాయి. అలాగే 30 మంది మిలిటెంట్లను మట్టుపెట్టాయని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే మిలిటెంట్లు ఐదు వేర్వేరు ప్రాంతాల్లో 200 మందిని బంధించినట్లు పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బలోచిస్థాన్ ప్రావిన్సులోని పర్వతప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు జాఫర్ ఎక్స్‌ప్రెస్ (Jaffar Express) వెళ్తున్న సమయంలో ఈ హైజాక్ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రైల్లోని తొమ్మిది బోగీల్లో 400 మంది ప్రయాణికులున్నారు. అలాగే రైల్లో ఉన్న బలోచ్ మిలిటెంట్లు చిన్న బృందాలుగా విడిపోయి ఉండటంతో.. ఆపరేషన్ కష్టతరంగా మారినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. బలోచ్ తిరుగుబాటుదారులు అఫ్గానిస్థాన్‌లోని తమ కీలక నేతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి వెల్లడించారు. హైజాక్‌లో మొత్తం 70 నుంచి 80 మంది వేర్పాటువాదులు పాల్గొన్నారంటూ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన నేపథ్యంలో బలోచిస్థాన్‌కు రాకపోకలు సాగించే అన్ని రైళ్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
* అసెంబ్లీ సమావేశాలకు అందరు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షాలు గందరగోళం చేసే ప్రయత్నం చేస్తాయని, సంయమనంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.
* దుబాయ్ నుంచి విమానంలో అక్రమంగా బెంగళూరుకు బంగారాన్ని తెస్తూ (gold smuggling) దొరికిపోయిన నటి రన్యారావు (Ranya Rao) కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నటి వివాహ వేడుకలో ఆమెతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) దిగిన ఫొటో తాజాగా వెలుగులోకి వచ్చింది. భాజపా నేత అమిత్ మాలవీయ ఈ ఫొటోను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు.
* నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి.. రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
* నిండా రెండేళ్లు కూడా నిండని ఆ బుడతడి బుడిబుడి అడుగులకు అవార్డులు తలవంచాయి. అతి చిన్నవయసులో 47 నిమిషాల్లో ఏకంగా 3.23 కిలోమీటర్ల దూరం నడిచి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుకు చెందిన అపురూప, సత్యనారాయణల కుమారుడు రుద్రాన్ష్.. తన తాత నరేంద్ర రెడ్డి ప్రోత్సాహంతో ప్రతిభను చాటుకున్నాడు. రానున్న రోజుల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను కూడా కైవసం చేసుకునేలా తయారు చేస్తామని రుద్రాన్ష్ కుటుంబ సభ్యులు తెలిపారు.
* చంద్రబాబు కుట్రలను ఎక్స్ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. ‘‘పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
* బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఎదురుదెబ్బ తగిలింది. షేక్ హసీనా ఆస్తుల సీజ్‌కు ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. షేక్ హసీనాతో పాటు, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో బ్యాంక్ అకౌంట్లను అధికారులు సీజ్ చేయనున్నారు. గత ఏడాది ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగగా, భారీ హింస చోటుచేసుకుంది. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె.. భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు ఆ దేశం చాలా ప్రయత్నాలు చేసింది. ఆమె పాస్ పోర్టును కూడా రద్దు చేసింది. హసీనాను తమ దేశానికి పంపించాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ కూడా లేఖ రాసింది. అయితే, తాజాగా ఢాకా కోర్టు హసీనా, ఆమె బంధువుల ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని ఆదేశించింది. కాగా, భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఇటీవల ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z