TCA ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Featured Image

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో టొరంటో-కెనడా నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సంబరాలలో రెండువేలమందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. స్థానిక మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికో ఇందుకు వేదిక అయింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ సంబరాలపై ఉన్న భక్తిశ్రద్ధలను కొనియాడారు. కెనడాలో ఇంత ఘనంగా జరుగుతున్న తెలంగాణ ఉత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉల్లాసంగా పాల్గొన్నారు. అత్యుత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి విజేతలకి తెలంగాణ కెనడా అసోసియేషన్. విభూతి ఫ్యాబ్ స్టూడియోస్ వారు బహుమతులను అందజేశారు. బతుకమ్మ పండుగకి విచ్చేసిన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి గెలిచిన వారికి ఒక గ్రాము బంగారం, 1/2 ఔన్స్ వెండి బహుమతిగా అందించారు.

స్పాన్సర్లు, వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని శ్రీనివాస్ మన్నెం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్షుడు శంతన్ నేరళ్లపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, కోశాధికారి రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు కోటేశ్వర్ చెటిపెల్లి, శరత్ యరమల్ల, శ్రీరంజని కందూరి, ఆనంద్ తొంట ధర్మకర్తల మండలి ఛైర్మన్ నవీన్ ఆకుల, ధర్మకర్తల మండలి సభ్యులు పవన్ కుమార్ పెనుమచ్చ, రాము బుధారపు, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ సభ్యులు - అతిక్ పాషా, కోటేశ్వర రావు చిత్తలూరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, ప్రకాష్ చిట్యాల, అఖిలేష్ బెజ్జంకి, సంతోష్ గజవాడ, కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీనివాస తిరునగరి, రాజేశ్వర్ ఈద, వేణుగోపాల్ రోకండ్ల, విజయ్ కుమార్ తిరుమలపురం, ప్రభాకర్ కంబాలపల్లి పాల్గొన్నారు.

Tags-Telangana Canada Association TCA Celebrates Batukamma In Toronto

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles