🕑 Published: July 22, 2026 at 05:22 PM CST
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) టాంపా బే ఆద్వర్యంలో ఒత్తిడిని సమన్వయించే సలహాలు-సూచనల సదస్సు ఏర్పాటు చేశారు. చేంజ్ సంస్థ వ్యవస్థాపకుడు కె.గోపాలన్ ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా పాల్గొని ఒత్తిడిని ముందస్తుగా గుర్తించడం, మనపై దాని ప్రభావం, దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను భూతద్దంలో చూడకుండా ఉండటం, వీటిని ఎదుర్కునేందుకు అవసరమైన ఆచరణాత్మక చిట్కాలను ఆయన వివరించారు. ఈ అవకాశం కల్పించిన నాట్స్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడ, డాక్టర్ మల్లికార్జున నంద్యాలలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విక్రం నంధ్యాల సమన్వయపరిచారు. ఒత్తిడిని అధిగమించడానికి ఈ సదస్సు ద్వారా లభించిన సలహాలు ఉపయోగపడతాయని ఆహుతులు అభిప్రాయపడ్డారు.
నాట్స్ కార్యక్రమాల గురించి రాజేశ్ కండ్రు వివరించారు. నాట్స్ టాంపా బే కోర్ టీమ్ సభ్యులు అను కోట, శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని, రమేష్ కొల్లి, సుమంత్ రామినేని, విజయ్ కట్టా, సురేష్ బొజ్జా, నవీన్ మేడికొండ, అనిల్ అరెమడ, రవి కాళిదిండి, సంజయ్ కొండ, శిరీష దొడ్డపనేని తదితరులు పాల్గొన్నారు. మురళీకృష్ణ మేడిచెర్ల, కిషోర్ నారె, శ్రవణ్ కుమార్ నిడిగంటిలు సహకరించారు.

