మెలిస్సా తెలుగు గ్రంథాలయ ప్రథమ వార్షికోత్సవం

Featured Image

టెక్సాస్ రాష్ట్రం మెలిస్సా నగరంలో ఏర్పాటు చేసిన ఎన్‌.వి‌.ఎల్‌ స్మారక తెలుగు గ్రంథాలయం ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నలజల నాగరాజు తండ్రి నలజల వెంకటేశ్వర్లు స్మారకార్థం ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. నాగరాజు తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న సేవలను వక్తలు అభినందించారు. తెలుగు భాషను వ్యాప్తి చేయడంలో ఈ గ్రంథాలయం కీలకపాత్ర వహిస్తోందని పేర్కొన్నారు. తెలుగువారికి ఇది సాంస్కృతిక కేంద్రం అని కొనియాడారు. తెలుగు పుస్తకాలు మన సంస్కృతి మూలాలను తదుపరి తరాలకు చేరవేసే కార్యక్రమానికి ఈ గ్రంథాలయం తోడ్పడుతోందని అన్నారు. భవిష్యత్తులో ఈ గ్రంథాలయం మరింత విస్తరించడానికి సహకరిస్తామని తెలిపారు.

గ్రంథాలయ నిర్వాహకుడు నాగరాజు మాట్లాడుతూ తన తండ్రి ప్రేరణతో ప్రారంభించిన ఈ గ్రంథాలయం ద్వారా పుస్తక సంస్కృతిని పునరుద్ధరించి, తెలుగు భాషను భవిష్యత్ తరాలకు అందజేయడానికి కృషి చేస్తానని వెల్లడించారు. గోపాల్ పోనంగి, సురేష్ మండువ, మల్లి వేమన, అనంత్ మల్లవరపు, చంద్రహాస్, విజయ్ తొడుపునూరి, మిమిక్రీ రమేశ్, బాపు నూతి, రవి తాండ్ర, కిషోర్ నారె తదితరులు పాల్గొన్నారు. హాజరైన పిల్లలందరికీ పలకలు, బలపాలు, పుస్తకాలు అందజేశారు.

Tags-Telugu Library In Melissa Texas Celebrates First Anniversary

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles