ఏపీ ఎన్నారై ప్రత్యేక ప్రతినిధులుగా మరో నలుగురు

🕑 Published: July 07, 2026 at 09:17 AM CST

విదేశాల్లోని తెలుగుదేశం శ్రేణులు సుదీర్ఘకాలం పాటు ఎదురుచూసిన వివిధ కమిటీల నియామకాలను ఏపీ సర్కారు దాదాపు పూర్తి చేసింది. విదేశాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా నలుగురు ప్రవాసాంధ్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారులుగా ప్రత్యేక జీతభత్యాలు, గౌరవమర్యాదలు వీరికి ఉంటాయి. ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉన్న మధ్యప్రాచ్య అరబ్బు దేశాలు, ఆగ్నేయ ఆసియా దేశాలకు రావి రాధాకృష్ణ, ఐరోపా దేశాలకు జయకుమార్ గుంటుపల్లి, ప్రపంచంలోని మిగిలిన దేశాలకు శ్రీనివాస్ పల్లపోటులు ప్రత్యేక ప్రతినిధిలుగా నియమితులయ్యారు. వీరితో పాటు ఉత్తర అమెరికాలో పెట్టుబడుల వ్యవహారాల సమన్వయకర్తగా సతీష్ మండువ నియమితులయ్యారు.

చమురు ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామి అయిన సౌదీ అరేబియాలో ఆయిల్, గ్యాస్ రంగంలో వ్యాపారం చేసే రాధాకృష్ణ స్వస్థలం కోనసీమ జిల్లా సఖీనేటిపల్లి మండలం. ఐరోపా ఖండంలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన జయకుమార్ గుంటుపల్లి స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. లండన్ లోని బ్రిటన్ తెలుగు సంఘానికి రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పని చేసిన ఆయన దశాబ్ద కాలానికి పైగా తెలుగుదేశం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఆఫ్రికా, ఆస్ట్రేలియా సహా ఇతరులకు కేటాయించని అన్ని దేశాలకు ఆస్ట్రేలియాలో నివసించే పల్లపోతు శ్రీనివాస రావును ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. గుడివాడకు చెందిన ఆయన తన బాల్యం నుంచి టీడీపీ అభిమాని. అమెరికాలో పెట్టుబడుల వ్యవహారాలకు లయజన్ ఆఫీసర్‌గా నియమితులైన సతీష్ మండువది ప్రకాశం జిల్లా, అమెరికాలో మూడు దశాబ్దాలకు పైగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న ఆయనకు తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడిగా పేరుంది.

📲 Join Our WhatsApp Channel
టాంటెక్స్ ఆధ్వర్యంలో 227వ సాహితీ సదస్సుఅర్వింగ్ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అమెరికా 250వ స్వాతంత్ర్యదినోత్సవంసైబర్ సెక్యూరిటీపై సచివాలయంలో APTS వర్క్‌షాప్నాట్స్ మేరీల్యాండ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఆర్ట్ వర్క్‌షాప్తానా పాఠశాల ఆధ్వర్యంలో ప్రవాస తల్లిదండ్రుల సమావేశం"అచ్చ తెలుగు తిట్లు"పై తానా సాహిత్య సదస్సుతితిదేకు రూ.1.1కోట్ల విరాళంATA Womens Forum In 19th ATA Conventionడెన్వర్‌లో రుక్మిణీ కళ్యాణం నృత్యరూపకంకాన్సాస్ వరదల్లో పరుచూరు యువకుడి గల్లంతుజొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక సిరికోన 2025 నవలారచన పోటీల విజేతలుఅమెరికా టు ఛలో ఇండియా - పెరుగుతున్న ప్రవాస భారతీయుల తిరుగు ప్రయాణంఫిలడెల్ఫియాలో తానా "ఫాదర్స్ డే"..పాల్గొన్న హీరో సుమన్సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరంలండన్‌లో కామారెడ్డి యువకుడి మృతిపద్మ పురస్కారం అందుకున్న డా.నోరిసిన్సినాటీలో అలరించిన మోహినీ భస్మాసుర కూచిపూడి నృత్యనాటకంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంచెన్నై కళాసుధ ఆధ్వర్యంలో గురుశ్రీ పురస్కార ప్రదానోత్సవంతానా-పాఠశాల ఆధ్వర్యంలో పితృదినోత్సవం
No Previous Next Article