వారధి ఇండియా ఫౌండేషన్ 2026 వార్షికోత్సవం

🕑 Published: October 04, 2026 at 05:55 PM CST

వారధి ఇండియా ఫౌండేషన్ 2026 వార్షికోత్సవం శనివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను విజయాలను గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో వారధి ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి డా. మోహన్ కందా 2013లో వారధిని స్థాపించారు. విద్య ద్వారా సాధికారత అనే స్ఫూర్తితో దేశానికి సానుకూల మార్పు తీసుకురాగలిగేలా భావితరాలను తీర్చిదిద్దడం సంస్థ ప్రధాన లక్ష్యం.

ప్రభుత్వ విద్యావ్యవస్థలు, సంస్థలు, ఉపాధ్యాయులను బలోపేతం చేసి, వారికి అవసరమైన మద్దతును అందించడం ఈ ఫౌండేషన్ ప్రధాన విధానం.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 52 జిల్లాల నుంచి 305 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి వ్యాసరచన, చర్చా పోటీల్లో పాల్గొన్నారు. విజేత జట్లకు మొదటి బహుమతిగా ₹33,000, రెండవ బహుమతిగా ₹30,000, మూడవ బహుమతిగా ₹27,000 అందించారు. పర్యావరణవేత్త, వాటా ఫౌండేషన్ వ్యవస్థాపక ట్రస్టీ ఉదయకృష్ణ పెద్దిరెడ్డి, నటుడు సుమంత్ అతిథులుగా పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
కూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి సరికొత్త రికార్డుతానా - పాఠశాల వేదికగా మహాత్మునికి ఘన నివాళిసౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా) ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవంTelangana Development Forum TDF Batukamma On Oct 10th In New Jerseyబోస్టన్ ప్రవాసులను అలరించిన సహస్ర భరతనాట్య అరంగేట్రంTexas/USA: ఫ్రిస్కో పార్కును దత్తత తీసుకున్న నాట్స్తానా ప్రపంచసాహిత్యవేదిక 96వ సమావేశం విజయవంతంOhio/USA: క్లీవ్‌ల్యాండ్‌లో తానా 5కె వాక్Dallas/USA - TANEX 5K WALK and RUN ON OCT 3rdహవాయి విశ్వవిద్యాలయ కీలక పదవిలో డా. దారా సురేంద్రచంద్రబాబుతో ఎన్నారై తెదేపా అధ్యక్షుడు డా.గురురాజా భేటీ450మంది పేదలకు భోజనం అందించిన నెబ్రాస్కా తెలుగు సమితిఅక్టోబర్ 1న కవిరాజు త్రిపురనేని రామస్వామి చైతన్య యాత్రసెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రీడా సంబరంజర్మనీలో వేడుకగా తెలుగు సంబరంఫిలడెల్ఫియాలో ఉత్సాహంగా సాగిన తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్ఉల్లాసంగా నెబ్రాస్కా తెలుగు సమితి వనభోజనాలుబే-ఏరియాలో వీక్షణం సాహితీ సంస్థ 14వ వార్షికోత్సవంన్యూజెర్సీలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలులండన్‌లో వైభవంగా వినాయక నిమజ్జనం
❮ Previous Article Next Article ❯