🕑 Published: September 04, 2026 at 09:43 PM CST
మిన్నియాపోలిస్‌లో తానా ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత బ్యాక్‌ప్యాక్‌లను అందజేశారు. స్థానిక బెతూన్ ఎలిమెంటరీ పాఠశాలలోని 150మంది విద్యార్థులకు వీటిని అందఏశారు.
తానా నార్త్ సెంట్రల్ రిప్రెసెంటేటివ్ రామ్ వంకిన, ప్రతినిధులు జయరాం నల్లమోతు, అశోక్ సుంకవల్లి, నాగ్ బొల్లు, ఆర్.కె. అన్నే, వేదవ్యాస్ అర్వపల్లి, అజయ్ తాళ్లూరి, చంద్ర చెన్నుపాటిలు వీటిని అందించారు. తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేనిలు సహకరించారు. తానాకు బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ బృందం ధన్యవాదాలు తెలిపారు.



