🕑 Published: September 09, 2026 at 06:34 PM CST
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. 45 మందితో ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు. అనివార్య కారణాలతో కార్యక్రమానికి హాజరుకాలేని కొందరు సభ్యులు జూమ్ ద్వారా ప్రమాణం చేశారు. టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా, కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ విశిష్ట అతిథిగా కార్యక్రమానికి హాజరయ్యారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ నూతన అధ్యక్షుడిగా డా. పిల్ గురురాజా బాధ్యతలు స్వీకరించారు.
Read More About Dr. Pill Guru Raja Here -
తెలుగుదేశం పార్టీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల మద్దతును మరింత బలోపేతం చేయడమే నూతన కార్యవర్గం లక్ష్యం కావాలని డా. గురురాజా పిలుపునిచ్చారు. నారా లోకేష్ విజన్‌కు అనుగుణంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ శ్రేణులను ఒకే యూనిట్‌గా తీర్చిదిద్దే దిశగా కొత్త కార్యవర్గం పనిచేస్తుందని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సేవా అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్టీ మనుగడ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు చేసిన కృషిని గుర్తుచేశారు. ఎన్ఆర్ఐ టీడీపీ కేవలం రాజకీయ విభాగం కాదని, ప్రవాసాంధ్రులకు–ఆంధ్రప్రదేశ్‌కు మధ్య వారధిగా పనిచేస్తుందని విదేశాల్లో ఉన్నప్పటికీ తమ మూలాలను మరవకుండా సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత ప్రతి ఎన్ఆర్ఐపై ఉందన్నారు. నిరసనలు, కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. తన తెలుగుదేశం ప్రయాణం ఎన్టీఆర్ చైతన్యరథం యాత్రతోనే ప్రారంభమైందని, వృత్తిరీత్యా అమెరికాకు వెళ్లినా పార్టీపై, సిద్ధాంతంపై తన అభిమానం మారలేదని చెప్పారు. “దేశం మారింది కానీ నా పార్టీ మారలేదు.. స్థలం మారింది కానీ నా సిద్ధాంతం మారలేదు. జీవితం అమెరికాలో ఉన్నా.. నా మనసు మాత్రం తెలుగుదేశంతోనే ఉంది” అని గురురాజా పేర్కొన్నారు.
గత మూడు దశాబ్దాలుగా ఎన్ఆర్ఐ టీడీపీ పార్టీ కార్యక్రమాలకు అండగా నిలుస్తూ వస్తోందని ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం పేర్కొన్నారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీని మరింత పటిష్టం చేయడంలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. విదేశాల్లో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడంతో పాటు, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి చేరువ చేయడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు కేవలం పార్టీ కార్యకలాపాలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. దేశం దాటినా తెలుగుదేశం జెండాను వదలకుండా, దూరంగా ఉన్నప్పటికీ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న వారే ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలని కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
ప్రమాణస్వీకారం చేసినవారిలో జనరల్ సెక్రటరీలుగా డా. చలసాని కిషోర్‌బాబు, బొడ్డు గంగాధరరావు, డా. ముక్కు తులసీకుమార్, ఉపాధ్యక్షులుగా కోమటి జయరాం, పుట్టగుంట సురేష్, మద్దిపట్ల ఇంద్రసేననాయుడు, రషీదా షేక్, కోడూరి శ్యాంప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కానూరు హేమా, ముప్పవరపు మాధవి, డా. చావా పద్మ, షాఫహద్ సయ్యద్, ఆళ్ల వెంకట్, చెంచు వేణుగోపాల్, బొద్దులూరి యాష్, అన్నమేటి బాలసుబ్రమణ్యం, నక్కల శివనాగరాజు, అడుసుమిల్లి విజయకుమార్, జవ్వాది విజేత, ఖాలీద్ సైఫుల్లా, కౌతారపు లావణ్య, కోడి రాజారవికిరణ్, రాచూరి రెడ్డి మోహన్, చెన్నుపాటి విజయ్, కార్యదర్శులుగా అడుసుమిల్లి కృష్ణప్రియ, రవడ సుభాష్, బెజవాడ సూర్య, పరుచూరి తరణీ, జడ నాగరాజు, పొనుగోటి పింకీ రేవతి, పల్లేటి రాజేష్‌బాబు, గోగినేని శ్రీనివాస్, నన్నా అనీల్, గాలి దుర్గాభవాని, పేరూరు రామకృష్న, వంకా వెంకటరమణమ్మ, నంబళ్ల గోపీ రవికుమార్, పరుచూరి కవిత, జొన్నలగడ్డ నర్మద, గుడివాడ వెంకటరమణ, కోశాధికారిగా అబ్బూరి శ్రీనివాస్, సమన్వయకర్తలుగా దొడ్డపనేని సాగర్, బొల్లినేని సాయి, కోట గౌతమీశ్వేత ఉన్నారు.











