Texas/USA: ఫ్రిస్కో పార్కును దత్తత తీసుకున్న నాట్స్

🕑 Published: September 28, 2026 at 04:28 PM CST

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) డాలస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను, సేవాభావాన్ని పెంపొందించేందుకు "అడాప్ట్ ఎ పార్క్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రిస్కోలోని "మొనార్క్ వ్యూ పార్క్"లో నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు, నాట్స్ సభ్యులు పాల్గొన్నారు. పార్క్ పరిసరాలను శుభ్రం చేసి, నిర్వహణను మెరుగుపరిచేలా 20మంది ప్రవాస యువత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు కిరణ్ నారె, పావని నున్న, సభ్యులు బదరి బియ్యపు, నరేన్ శివ, హృదయ్ దండు, రోహిత్ సుంకర, రవి తాండ్ర, విశాలాక్షి నారె, దీపిక నిడిగంటి, ధృవ్ పెదిరెడ్ల, వేద నిడిగంటి, అద్వైత్ నారె, అర్ణవ్ నారె, జోనల్ వైస్ ప్రెసిడెంట్ రత్నాకర్ సెట్టిపల్లి, నేషనల్ మీడియా రిలేషన్స్ కోఆర్డినేటర్ శ్రవణ్ నిడిగంటి, ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ కిషోర్ నారె తదితరులు పాల్గొన్నారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ సభ్యులను బోర్డ్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ రాజ్ అల్లాడలు అభినందించారు.

📲 Join Our WhatsApp Channel
తానా ప్రపంచసాహిత్యవేదిక 96వ సమావేశం విజయవంతంOhio/USA: క్లీవ్‌ల్యాండ్‌లో తానా 5కె వాక్Dallas/USA - TANEX 5K WALK and RUN ON OCT 3rdహవాయి విశ్వవిద్యాలయ కీలక పదవిలో డా. దారా సురేంద్రచంద్రబాబుతో ఎన్నారై తెదేపా అధ్యక్షుడు డా.గురురాజా భేటీ450మంది పేదలకు భోజనం అందించిన నెబ్రాస్కా తెలుగు సమితిఅక్టోబర్ 1న కవిరాజు త్రిపురనేని రామస్వామి చైతన్య యాత్రసెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రీడా సంబరంజర్మనీలో వేడుకగా తెలుగు సంబరంఫిలడెల్ఫియాలో ఉత్సాహంగా సాగిన తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్ఉల్లాసంగా నెబ్రాస్కా తెలుగు సమితి వనభోజనాలుబే-ఏరియాలో వీక్షణం సాహితీ సంస్థ 14వ వార్షికోత్సవంన్యూజెర్సీలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలులండన్‌లో వైభవంగా వినాయక నిమజ్జనంజపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలుఅక్టోబరులో కొసరాజు రచనల ఆవిష్కరణGGH నాట్కో క్యాన్సర్ సెంటరులో అత్యాధునిక జన్యు పరీక్షలుప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘంసిరికోన సాహితీ అకాడమీ 2026 నవలల పోటీఫ్రిస్కోలో టాంటెక్స్ ఉచిత వైద్య శిబిరం
❮ No Previous Next Article ❯