🕑 Published: October 18, 2026 at 03:47 PM CST
సౌదీ అరేబియాలోని జెద్ధా తెలుగు మిత్రులు (జె.టి.యం) భారతీయ కాన్సులేటు సౌజన్యంతో శుక్రవారం సాయంత్రం బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించింది.
సంబరాలలో ముఖ్య అతిథిగా భారతీయ కాన్సుల్ జనరల్ ఫహాద్ ఖాన్ సూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు వారితో సహా భారతీయులు ఎవరు కూడా ఎక్కడ ఉన్నా తమ మూలలు, సంస్కృతి పరిరక్షణకు పాటుపాడాలని పిలుపునిచ్చారు. కష్టాలలో తోటి భారతీయులను ఆదుకోవడానికి కూడా తెలుగు ప్రవాసీయులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

