Movies

ఆత్మగౌరవం మెండుగా

ఆత్మగౌరవం మెండుగా

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తోంది నివేదా థామస్‌. ఇప్పుడు మరో కొత్త చిత్రంలో అలరించనుంది. వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తున్న వినోదాత్మక చిత్రం ‘బ్రోచేవారెవరురా’. చలనమే చిత్రము- చిత్రమే చలనము ఉపశీర్షిక. ఇందులో మిత్ర అనే అనే అమ్మాయిగా నటిస్తోంది నివేద. తాజాగా తన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. అందులో సంప్రదాయ నృత్యకారిణి భంగిమలో ఆకట్టుకొంటోంది. ఈ పోస్టర్‌ను నివేద ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘‘యుక్త వయసు అమ్మాయిలు బలమైన వ్యక్తిత్వం ఉన్నవారిగా మారితే మరింత అందంగా ఉంటారు. ఈ సినిమాలో ఆత్మగౌరవం మెండుగా ఉన్న అమ్మాయి పాత్రలో నటిస్తున్నందుకు ఎంతో గర్విస్తున్నా’’ అని పోస్ట్‌ చేసింది నివేద. ఈ చిత్రంలో శ్రీవిష్ణు, సత్యదేవ్‌ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రియదర్శి, రాహల్‌ రామకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.