దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ జీవితాల ఆధారంగా సినిమా తీస్తానని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని తర్వాత ఆయన ఆ సినిమా ఊసే ఎత్తలేదు. అయితే త్వరలోనే ‘శశికళ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని వర్మ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టును ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘శశికళ’ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ప్రేమ ప్రమాదకరమైన రాజకీయం’ అని దానిపై రాశారు. మరి ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వర్మ వెల్లడించలేదు. వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా తీసిన ఈ సినిమా అనేక వివాదాలు ఎదుర్కొంది. తెలంగాణలో విడుదలైన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు స్టే ఆర్డర్ వల్ల ఆగింది.
వర్మ దృష్టి తమిళ రాజకీయాల వైపుకు
Related tags :