Fashion

చెత్తతో దుస్తులు

fashion from waste plastic

*** Using waste plastic and other garbage items to make fashionable clothes.

పనికిరాని వలలు, వాడేసిన ప్లాస్టిక్‌, అరిగిపోయిన టైర్లు.. వీటితో ఏం చేయొచ్చు? అదేం ప్రశ్న… పనికిరావు కాబట్టి పడేయడమో, కాల్చేయడమో చేయాలి. మూడో మార్గం ఉందంటోంది… ఫ్యాషన్‌ ప్రపంచం. వీటితో కొత్త దుస్తులు తయారు చేసి.. ప్రపంచాన్ని చెత్త భారం నుంచి బయటపడేయటమే కాక.. ట్రెండీగా మార్చొచ్చని చెబుతున్నారు. వీటితో వస్త్రాలు, దుస్తులు తయారు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ట్రెండ్‌ ప్రయోగాత్మకంగా 2015లో ప్రారంభమైనా… ప్రస్తుతం ఊపందుకొంది. పరిశ్రమల్లో చేతులు తుడుచుకున్నాక వదిలేసే వ్యర్థాలను సైతం ఉపయోగించి ఫ్యాషన్‌ దుస్తులు తయారు చేసి అదరగొడుతున్నారు డిజైనర్లు. కాఫీ, టీలు తాగాక గ్లాసులో మిగిలే గసితోనూ దుస్తులు తయారు చేసి సృజనాత్మకతను చాటుకుంటున్నారు. వీటన్నింటికీ సహజ రంగులనే ఉపయోగిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ దుస్తులను మార్కెట్లోకి తెస్తున్నారు.