Movies

12 సంవత్సరాలు పెద్ద

malaika arjun wedding

ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో ప్రేమ, పెళ్లి వ్యవహారాల హవా ఎక్కువగా ఉంది. ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వేడుకలో అలియాభట్‌, రణ్‌బీర్‌సింగ్‌కు ఐ లవ్‌ యు చెప్పడం, సోమవారం మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జంటగా కనిపించడం హాట్‌ టాపిక్‌గా మారింది. మలైకా, అర్జున్‌ కపూర్‌ ప్రేమలో ఉన్నారనే వార్త ఏడాది క్రితం నుంచీ హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అఫీషియల్‌గా తమ ప్రేమ గురించి చెప్పలేదు. కానీ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం మాత్రం అఫీషియల్‌గానే చేస్తుంటారు. అర్జున్‌ కన్నా మలైకా వయసులో 12 సంవత్సరాలు పెద్ద. వీరిద్దరూ ఈ నెల 19న పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ముంబై మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతేకాకుండా మలైకా బ్యాచిలరేట్‌ పార్టీ కోసం తన ేస్నహితులు, ప్రియుడు అర్జున్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ ఎంజాయ్‌ చేస్తూ తీసుకున్న ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అందులో మలైకా తీసిన ఫొటోను అర్జున్‌ మొదటిసారి లైక్‌ చేశారట. వీరిద్దరి పెళ్లి గురించి మలైకా మాజీ భర్త అర్బాజ్‌ఖాన్‌ను ఓ విలేకరి ప్రశ్నించగా ఆయన నవ్వి ‘‘ఈ ప్రశ్న అడగడానికి మీరు చాలా ఆలోచించే ఉంటారు. నేను కూడా బాగా ఆలోచించి రేపు చెప్పనా’ అనేసి తప్పించుకున్నారు.