DailyDose

దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకే-రాజకీయ-04/02

rahul gandhi from wayanad 2019

అందుకే వయనాడ్ నుండి పోటీ చేస్తున్న
* దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకే తాను వయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ నేడు మేనిఫెస్టో విడుదల చేసింది. సంపద, సంక్షేమమే లక్ష్యంగా దేశంలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని రాహుల్‌ తెలిపారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి పోటీ చేసే విషయాన్ని రాహుల్‌ ప్రస్తావించారు.
* వరంగల్ టీఆర్‌ఎస్ బహిరంగ సభ ప్రారంభం
వరంగల్‌లో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ ప్రారంభమైంది. అజంజాహీ మిల్లు గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. జనం భారీగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌రావువరంగల్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి దయాకర్ఎంపీలుఎమ్మెల్యేలుఎమ్మెల్సీలురాష్ట్ర స్థాయి నాయకులురాష్ట్రస్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లుసభలో ఉన్న అన్నాదమ్ములుఅక్కాచెల్లెల్లకు నమస్కారాలు తెలిపారు.
* కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. ఐదింటిపై దృష్టి: రాహుల్‌
దేశంలో 2030 నాటికి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్త మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ విజన్‌ను ఆవిష్కరించామని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశామని తెలిపారు. దీన్ని గదిలో కూర్చుని రూపొందించలేదని, ప్రజల మనసులో ఆలోచన ప్రతిబింబించేలా రూపకల్పన చేశామని చెప్పారు. ముఖ్యంగా ఐదు అంశాలపై దృష్టి సారించామని వివరించారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ప్రియాంక గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, రణ్‌దీప్‌ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు.
*ఎచ్చెర్ల బహిరంగ సభలో విజయమ్మ
శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని వైకాపా గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ విమర్శించారు. దివంగత మహానేట వైఎస్సార్ ఈ జిల్లాకు చేసిన అభివృద్ధి చూసిన ప్రజలు 2009లో తొమ్మిది సీట్లలో గెలిపించారని గుర్తు చేసారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని మండిపడ్డారు. జిల్లాలోని 34ప్రభుత్వ పాటశాలలను, ఐదు ఎస్సీ హాస్టళ్ళు ను చంద్రబాబు మూసివేశారని తెలిపారు. జిల్లాలోని ప్రతి చిన్న ప్రాజెక్టును పూర్తీ చేస్తామన్నారు. మత్సకారులను వై ఎస్ జగన్ అన్ని రకాలుగా ఆదుకుంటారని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జీ.సిగడాంలో జరిగిన బహిరంగ సభలో విజయమ్మ ప్రసంగించారు. ఎండను సైతం లెక్క చేయకుండా అక్కడకు వచ్చిన వారికి విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు.
* కత్తి మహేష్‌ ఎన్నికల ప్రచారం
టీడీపీ ప్రభుత్వంతో ఏ వర్గాలకూ న్యాయం జరగలేదని సినీ విమర్శకుడు కత్తి మహేష్‌అన్నారు. ఎస్సీలను టీడీపీ కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని, మనమంతా వైఎస్సార్‌ సీపీకి అండగా ఉండాలన్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలంలోని గోళ్ళపాడు, ముప్పాళ్ళ గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో సోమవారం వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాలనీవాసులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్సీలంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలపాలన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు.
* జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలే- లంకా దినకర్‌
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని టీడీపీ నేత లంకా దినకర్‌ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోగా తిరిగి విమర్శలు చేస్తున్నారని అన్నారు. మోదీ పాలనలో నోట్ల రద్దు తర్వాత.. ఏటీఎం అంటే ఎనీ టైం నో మనీ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. క్రూరత్వ మనస్తత్వం ఉన్న వ్యక్తులు క్రూరంగానే ప్రవర్తిస్తారని లంకా దినకర్‌ వ్యాఖ్యానించారు.
* భారత్‌ అభివృద్ధే లక్ష్యంగా ఎజెండా- మన్మోహన్‌
దేశ ప్రజల అభిమతం, ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించామని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్‌ అభివృద్ధే లక్ష్యంగా ఎజెండా ఉంటుందన్నారు. పదేళ్ల యూపీఏ పాలనలో దారిద్ర్య నిర్మూలనకు కృషి చేశామని, 2030 నాటికి దేశంలో పేదరికం నిర్మూలనకు కృషి చేస్తామని మన్మోహన్‌ సింగ్ స్పష్టం చేశారు.
* దసరా తరువాత నేనేంటో చూపిస్తా: జగ్గారెడ్డి
తన సహనాన్ని చేతకాని తనంగా చూడొద్దని, దసరా వరకు ఇలాగే ఉంటానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. దసరా తరువాత నేనేంటో చూపిస్తానని వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. తాను టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను టీఆర్ఎస్‌లోకి వెళ్లనని చెప్పినా.. అలాగే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డి అభివృద్ధి కోసం కృషి చేస్తానని, అభివృద్ధిపై నియోజకవర్గ ప్రజలతో చర్చిస్తానని అన్నారు.
*భారత సైన్యం మోడీ సేన
ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో భారత సైన్యాన్ని మోడీ సేన గా అభివర్ణిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో కేంద్రమంత్రి వీ.కే.సింగ్ తరపున ప్రచారం చేస్తూ పై వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి పోషిస్తే మోడీ సేన వారికి బాంబులు బుల్లెటతో సమాధానం చెబుతోందని ఆదిత్యనాద్ చెప్పారు. పరోక్షంగా భారత సైనిక దళాన్ని ఆయన మోడీ సేనగా పేర్కొన్నారు. దీనిపై విమర్శలు రావడంతో దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
*లాలూ రబ్రీ మోర్చా
లోక్ సభ ఎన్నికల ముంగిట బీహార్ లో అదీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి నుంచి కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. చంచల స్వభావిగా పేరున్న లాలూ పెద్ద కుమారుడు మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సోమవారం ఆకస్మికంగా తన తండ్రి, తల్లి పేర్లతో లాలూ రబ్రీ మోర్చా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆర్జేడీ టికెట్ పై పోటీ చేయాల్సిందిగా తల్లి రబ్రీదేవిని కోరారు. ఆమె అంగీకరించకుంటే తానె అక్కడి నుంచి బరిలోకి దిగుతానని తెలిపారు. లాలూ రబ్రీ మోర్చా తరపున రాష్ట్రంలోని పలు స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
*ఎవరితోనూ రహస్య పొత్తు లేదు
భాజపా, తెరాసతో వైకాపాకి రహస్య పొత్తు లేదని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘనవిజయం సాధిస్తామని ఆ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు, బాపట్ల పట్టణాలలో సోమవారం నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. వైకాపా ఏర్పాటైనపటి నుంచీ ఎవరితోనూ పొత్తు లేకుండానే ఎన్నికల్లో పల్గొంతున్నామని గుర్తు చేశారు. తెరాసతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడారని విమర్సించారు. నాలుగేళ్ళు భాజపాతో అంతకాగి ఇప్పుడు ఎన్నికల సమయంలో వైకాపా ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుండంటూ దుష్ప్రచారం సెహ్స్తున్నారని ధ్వజమెత్తారు. రాజన్న రాజ్యం రావాలన్నా రాష్ట్రానికి ప్రత్యెక హోదా, యువతకు ఉపాధి అవకాశాలు లబించాలన్న జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆమె పేర్కొన్నారు.
*నేను తమన్నా.. మీ ఓటు నాకేనమ్మా?
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి సోమవారం ఉండవల్లిలో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలను కలిసి ఈ దఫా తనకు ఓటు వేయాలంటూ ఇలా కోరారు.
*తెదేపా నాశనానికి ప్రధాని కుట్ర
విభజన గాయాలతో ఉన్న రాష్ట్రానికి న్యాయం చేస్తారని నాలుగున్నరెల్ల మీతో కలిసి పనిచేస్తే మీరు రాష్ట్రానికి చేసిన్దేమితని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రధాని మోడీని ప్రశ్నించారు.తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో సోమవారం ఆయన శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేస్తారనే ఉద్దేశ్యంతో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో చేరామన్నారు. అప్పట్లో రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యెక హోదా పదేళ్ళు ఇవ్వాలని కోరింది. భాజాపానే అని, దీని వల్ల రాష్ట్రానికి న్యాయం చేస్తారేమోనని ఎదురు చూసామని అన్నారు. తెరాస జగన్ తో చేతులు కలిపి ప్రజలకు అండగా ఉన్న తెదేపాను నాశనం చేస్యలని ప్రధాని కుట్ర పన్నారని విమర్శించారు. ఆర్ధిక నేరగాళ్ళతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును అన్ని విధాలా అణచివేస్తున్న మీతో జతకట్టి ముందుకు సాగాలా? అని ప్రశ్నించారు. ప్రజలు మమల్ని నమ్మి అధికారం ఇచ్చారు. వారి ఋణం తీర్చుకునేందుకు రాష్ట్రానికి న్యాయం చేస్తామన్న వారితో ముందుకు సాగడం తప్పా? అంటూ నిలదీశారు. ఇన్ని అబద్దాలు ఆడే ప్రధానిని తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని యనమల పేర్కొన్నారు.
*చేవెళ్లను అభివృద్ధి చేస్తా..- జనార్ధన్ రెడ్డి
ప్రస్తుత ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రధాని నరేంద్ర మోదీ మాదిరిగానే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తానని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి జనార్ధన్ రెడ్డి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ సభలో ప్రసంగించిన జనార్ధన్ రెడ్డి.. పేదల కోసం మోదీ అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ పాటుపడుతున్నారని.. ఆయన మళ్లీ ప్రధాని అవడం ఖాయం అన్నారు. అదేవిధంగా చేవెళ్లలో బీజేపీ గెలుపు కూడా ఖాయం అన్నారు. తాను గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
*బీజేపీ-వైసీపీ బంధానికి అదే నిదర్శనం: రామ్మోహన్
అనంతపురంలో కియా మోటార్స్ మోదీ వల్లే వచ్చిందని జగన్ చెప్పడం దారుణం అని టీడీపీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మోహన్ అన్నారు. మోదీకి వత్తాసుగా జగన్ చేసిన ఈ వ్యాఖ్యలే బీజేపీ-వైసీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం అని పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్లే ఏపీలో కియా మోటార్స్ వచ్చిందని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీకి రావాల్సిన వోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీ పుణెకు తరలివెళ్లడంపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో రూ.24 వేల కోట్లతో ఆసియా పేపర్ అండ్ పల్స్ కంపెనీ ఏర్పాటుకు ముందుకొస్తే.. కేంద్రం అడ్డుకుందన్నారు.
*వారి కుటుంబాల వృద్ధే.. అభివృద్ధి
‘తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌ పార్టీల నాయకులెవరికీ దేశంలోని కోట్లాది మంది ప్రజల యోగక్షేమాలు అక్కర్లేదు. వారు వారి కుటుంబాల రాజకీయ స్థిరత్వం కోసమే పని చేస్తున్నారు. దేశం కోసం అంకిత భావంతో పని చేస్తున్న భాజపా మాత్రమే ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేరుస్తుంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గడచిన ఐదేళ్లలో తన పనితీరు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చూసి భాజపాకు ఓటు వేయాలని కోరారు. భాజపా ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
*గోల్కొండ కోటలో ఎర్రకోట యుద్ధం!
హోరాహోరీ పోరులో ప్రతీ స్థానం కీలకమైనదే. అందుకే తెలంగాణలోని 17 స్థానాల్లో వీలైనన్ని దక్కించుకోడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెరాస అధినేత కేసీఆర్‌ తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సభల ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి రాష్ట్రానికి వచ్చి వెళ్లిన రాహుల్‌ సోమవారం మూడు సభలు నిర్వహించారు. త్వరలో మరో సారి వచ్చే అవకాశం ఉంది. రెండురోజుల క్రితం మహబూబ్‌నగర్‌ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ తాజాగా హైదరాబాద్‌ సభలో పాల్గొన్నారు. ఇప్పటికే విస్తృత పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం అదే రోజు గోదావరిఖనిలో ప్రచార సభలో ప్రసంగించారు. దాదాపు ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ పర్యటించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. సోమవారం నాటి సభల్లో నరేంద్ర మోదీ మజ్లిస్‌, తెరాస బంధంపై నిప్పులు చెరిగారు. కుటుంబ అభివృద్ధి తప్ప రాష్ట్రాభివృద్ధి వారికి పట్టదని విమర్శించగా.. తెరాస, భాజపాల మధ్య రహస్య ఒప్పందం ఉందని.. కేవలం ఓటర్లను మభ్యపెట్టడానికే ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారని రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ఇక కాంగ్రెస్‌, భాజపాల పాలన వల్లనే దేశం ఈ గతిలో ఉందని.. రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావలసి ఉందని కేసీఆర్‌ అన్నారు. మొత్తంగా ప్రధాన పార్టీల ప్రచార హోరుతో గోల్కొండ కోటలో ఎర్రకోట యుద్ధం సాగుతోంది.
*దేశాన్ని పాలించేది ప్రాంతీయ పార్టీలే
వ్యాపారులు ఆదాయపు పన్నును ఎగ్గొట్టి రూ.కోట్లల్లో నష్టం చేస్తున్నా పట్టించుకోని మోదీ.. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయించాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఆయన సొమ్ము ఏమో పోయినట్లు ఇప్పటివరకు అమలు చేయలేదు. దేశాన్ని పాలించిన భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు నిర్వహిస్తున్న సభలకు జనాలు రావడం లేదు. మోదీ హైదరాబాద్‌లో నిర్వహించిన సభకు జనాలు లేక వేచి చూడాల్సి వచ్చింది. రాహుల్‌ సభకు కనీసం 3,000 మంది కూడా రాలేదు. ప్రజల ఆదరణ లేని ఈ పార్టీలు దేశాన్ని ఏవిధంగా పాలిస్తాయి?’‘కేంద్రంలో కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు.. భాజపాకు అసలే అవకాశాలు లేవు.. దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుంది.. అందుకే జాతీయ పార్టీలు చేస్తున్న ప్రచారాలకు ఆగం కాకుండా శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
*వారి కుటుంబాల వృద్ధే.. అభివృద్ధి
‘తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌ పార్టీల నాయకులెవరికీ దేశంలోని కోట్లాది మంది ప్రజల యోగక్షేమాలు అక్కర్లేదు. వారు వారి కుటుంబాల రాజకీయ స్థిరత్వం కోసమే పని చేస్తున్నారు. దేశం కోసం అంకిత భావంతో పని చేస్తున్న భాజపా మాత్రమే ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేరుస్తుంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గడచిన ఐదేళ్లలో తన పనితీరు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చూసి భాజపాకు ఓటు వేయాలని కోరారు. భాజపా ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
*పది సీట్లు రాకున్నా జాతీయ పార్టీలేనా?
దక్షిణాదిలో ఏ రాష్ట్రంలోనూ పది సీట్లు కూడా గెలవని పార్టీలకు జాతీయ పార్టీలుగా కొనసాగే అర్హత లేదని తెలంగాణ రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం అంతర్థానమైపోయిందని, కాంగ్రెస్‌ పార్టీకి అదే గతి పడుతుందని అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి సోమవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుల సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘ప్రజల ఆకాంక్షల కోసం పోరాడుతున్న పార్టీకే ఆదరణ దక్కుతుంది. దక్షిణాదిలో ఆరు రాష్ట్రాల్ల్లో ఒక్క రాష్ట్రంలో కూడా పట్టుమని పది సీట్లు రాని కాంగ్రెస్‌, భాజపా జాతీయ పార్టీలు ఎలా అవుతాయో ప్రజలు ఆలోచించాలి.
*జైట్లీ సంతకం ఫోర్జరీ
అమెరికా సంస్థతో 80వేల కోట్ల డాలర్ల ఒప్పందం, భారీ లాభమంటూ దిల్లీకి చెందిన ముగ్గురు ఘరానా నిందితులు హైదరాబాద్‌ వ్యాపారి తారక్‌నాథ్‌ను మోసం చేసి రూ.20కోట్లు స్వాహా చేశారు. ఇందుకోసం ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంతకాన్నే ఫోర్జరీ చేశారు. టెక్సాస్‌కు వెళ్లి ఒప్పందం కుదుర్చుకునేందుకు మరో రూ.నాలుగు కోట్లు అవసరమంటూ బాధితుడిని తొందరపెట్టారు. ఒప్పందం కుదుర్చుకునే సంస్థతో మాట్లాడించమంటూ వ్యాపారి తారక్‌నాథ్‌ ప్రశ్నించడంతో రేపుమాపు అంటూ నెట్టుకొచ్చారు.
*ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని మోదీ,కేసీఆర్‌లకు తాకట్టు పెడతారా?
‘కేసీఆర్‌ వేసే బిస్కెట్‌ కోసం వెళ్తారా.. పులివెందుల పౌరుషం లేదా మీకు… ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మోదీ, అమిత్‌షా వద్ద తాకట్టు పెట్టి కాళ్లు పట్టుకుంటారా?’ అని జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడలేని జగన్‌కు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెంలలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడలేని చంద్రబాబు నాయుడు గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవడం మంచిదని హితవు పలికారు. తెదేపా, వైకాపాలతో కలిసి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఎంతకాలం ఉంటుందని కొందరు అంటున్నారని.. జన సైనికుల్లో నలుగురు నా శవాన్ని మోసేవరకూ పార్టీని మోస్తానని ఆవేశంగా మాట్లాడారు.
*తెరాసకు హైదరాబాద్‌ అత్యంత కీలకం
తెలంగాణ రాష్ట్రసమితికి హైదరాబాద్‌ నగరం అత్యంత కీలకమైందని, నగరంతో అనుసంధానమై ఉన్న సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించేందుకు కార్పొరేటర్లు కృషి చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చెప్పారు. జీహెచ్‌ఎంసీ, శాసనసభ ఎన్నికలకు మించిన మెజారిటీని సాధించేందుకు కృషి చేయాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో డివిజన్లవారీగా వచ్చిన ఓట్లను ప్రామాణికంగా తీసుకొని వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్నారు. సోమవారం కేటీఆర్‌ నగరంలోకి వందమంది తెరాస కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
*‘దక్షిణాన భాజపాకు 10 స్థానాలైనా రావు’
రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు తెరాస గెలిస్తే ప్రజలకు లాభం.. కాంగ్రెస్‌ గెలిస్తే రాహుల్‌ గాంధీకి, భాజపా ఎంపీలు గెలిస్తే మోదీకి లాభమని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దిల్‌సుఖ్‌నగర్‌ పీఅండ్‌టీ కాలనీలో సోమవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతంలో ఆరు రాష్ట్రాల్లో 130 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని.. అందులో భాజపాకు 10 కూడా దక్కే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని అదే ఏపీలోని పోలవరానికి జాతీయ హోదా, 90 శాతం నిధులను భరిస్తోందన్నారు.
*అధికారంలోకి వస్తే ప్రత్యక్ష పద్ధతిలో మేయర్‌ ఎన్నిక: రాహుల్‌
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నగరాలే లక్ష్యంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరో హామీ గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే నగరాల మేయర్లను కూడా ఐదేళ్ల కాలపరిమితికి ఓటర్లే ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెడతామని ప్రకటించారు. నగరాల్లో మెరుగైన జీవితాన్ని అందించడానికి ‘ఎన్నికైన కౌన్సిళ్లు’ కృషి చేస్తామన్నారు. మేయర్లు, కౌన్సిళ్లకు జవాబుదారీగా ఉండే నిపుణులతో కూడిన బృందాలతో పరిపాలన నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ సోమవారం ట్వీట్‌ చేశారు.
*లాలూ రబ్రీ మోర్చా’ పార్టీని ప్రకటించిన తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌
లోక్‌సభ ఎన్నికల ముంగిట బిహార్‌లో, అదీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇంటి నుంచి కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ సోమవారం ఆకస్మికంగా తన తండ్రి, తల్లి పేర్లతో ‘‘లాలూ రబ్రి మోర్చా’’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్జేడీ టికెట్‌పై సరన్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన మామ చంద్రికారాయ్‌పై పోటీ చేయాల్సిందిగా తల్లి రబ్రీదేవిని కోరారు. ఆమె అంగీకరించకుంటే తానే అక్కడి నుంచి బరిలోకి దిగుతానన్నారు. లాలూ రబ్రి మోర్చా తరఫున రాష్ట్రంలోని పలు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
*భాజపా, కాంగ్రెస్‌లను తప్పిస్తేనే అభివృద్ధి
భాజపా, కాంగ్రెస్‌లను తప్పిస్తేనే దేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని నిజామాబాద్‌ ఎంపీ కవిత పేర్కొన్నారు. అయిదేళ్లలో దేశం రాష్ట్రం వైపు చూసేలా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. అన్ని రాష్ట్రాలు మన పథకాలను అనుసరిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి సోమవారం కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ…ప్రపంచంలో అగ్ర దేశాలైన అమెరికా, జపాన్‌, రష్యా, చైనా, దుబాయి మాదిరి మన దేశం ఎందుకు ప్రగతి సాధించలేదని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ పాలించింది కాంగ్రెస్‌, భాజపాలేనన్నారు.
*4న హైదరాబాద్‌లో మాయావతి, పవన్‌ల ప్రచారం
బహుజన్‌ సమాజ్‌పార్టీ అధినేత్రి మాయావతి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 3, 4, తేదీల్లో పర్యటించనున్నారు. మూడు బహిరంగ సభల్లో పాల్గొంటారు. 3న విజయవాడలో 4న తిరుపతిలో అదే రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో నిర్వహించే సభల్లో వారు ప్రసంగిస్తారు.
*వైకాపా అభ్యర్థుల్లో నేరచరితులు అధికం
వైకాపా లోక్‌సభ అభ్యర్థుల్లో 12మంది, శాసనసభ అభ్యర్థుల్లో 100 మందిపై తీవ్ర నేరారోపణలున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెదేపా ఎన్నికల మిషన్‌పై బూత్‌ కన్వీనర్లు, సేవామిత్రలు, తెదేపా నేతలతో సోమవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పోలింగ్‌ వరకు పార్టీ ప్రచారం ఉద్ధృతంగా చేయాలి. అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలి. సేవామిత్రులు, బూత్‌ కన్వీనర్లు పట్టుదలగా పని చేయాలి. వీవీప్యాట్‌ రశీదులపై అవగాహన పెంచాలి. తెదేపా గెలుపు ఏకపక్షం కావాలి’’ అని సూచించారు.
*అవినీతిని వ్యవస్థీకరించిన మీరా మాట్లాడేది?
ఓ వైపు ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తూ, అవినీతి గురించి మాట్లాడడం అసహ్యంగా లేదా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్‌లో మోదీపై ధ్వజమెత్తారు. ‘నల్ల ధనాన్ని విదేశాల నుంచి తెస్తామని హామీ ఇచ్చి బ్యాంకులు దోచిన వారిని దేశాన్ని దాటించారు. రూ.లక్ష కోట్లు దోచిన వారికి అభయమిస్తున్నారు. రాజధాని అమరావతిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని మట్టి, నీరు ముఖాన కొట్టారు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని, ప్రత్యేకహోదా ఇచ్చి ఆదుకుంటామని తిరుపతి వెంకయ్య సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయి’’ అంటూ వరసగా ట్వీట్లు చేశారు.
*పోలవరం తెలుగువారికి ఏటీడబ్ల్యూ
‘‘ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పారు. ఆంధ్రులకు ద్రోహం చేశారు. ఏ మొహం పెట్టుకొని రాష్ట్రంలో తిరుగుతున్నారో అర్థం కావడం లేదు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. కడప జిల్లా జమ్మలమడుగులో బహిరంగ సభ, పులివెందుల రోడ్‌షోలలో పాల్గొన్నారు. సోమవారం మధ్యాహ్నం కడప జిల్లా పర్యటన అనంతరం ఆయన తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. అప్పటికే ఆలస్యం కావడం, హెలికాప్టర్‌ ప్రయాణానికి సాంకేతిక సమస్యలు తలెత్తటంతో సభ రద్దు చేసుకున్నారు.
*ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని మోదీ, కేసీఆర్‌లకు తాకట్టు పెడతారా?
‘కేసీఆర్‌ వేసే బిస్కెట్‌ కోసం వెళ్తారా.. పులివెందుల పౌరుషం లేదా మీకు… ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మోదీ, అమిత్‌షా వద్ద తాకట్టు పెట్టి కాళ్లు పట్టుకుంటారా?’ అని జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడలేని జగన్‌కు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెంలలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
*వైకాపా అభ్యర్థుల్లో నేరచరితులు అధికం
వైకాపా లోక్‌సభ అభ్యర్థుల్లో 12మంది, శాసనసభ అభ్యర్థుల్లో 100 మందిపై తీవ్ర నేరారోపణలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెదేపా ఎన్నికల మిషన్‌పై బూత్‌ కన్వీనర్లు, సేవామిత్రలు, తెదేపా నేతలతో సోమవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సంస్థాగత బలమే తెదేపా బలం. ఈ ఎన్నికల్లో సాంకేతికత తెదేపాకు అదనపు బలం. పోలింగ్‌ వరకు పార్టీ ప్రచారం ఉద్ధృతంగా చేయాలి. అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలి. సేవామిత్రులు, బూత్‌ కన్వీనర్లు పట్టుదలగా పని చేయాలి. వీవీప్యాట్‌ రశీదులపై అవగాహన పెంచాలి. అన్ని వర్గాల అభిమానం పొందాలి. తెదేపా గెలుపు ఏకపక్షం కావాలి’’ అని సూచించారు.
*మజ్లిస్‌ చేతిలో కారు స్టీరింగ్‌
భాగ్యనగరం యువశక్తికి ప్రేరణగా నిలుస్తోందని.. ప్రపంచంలోనే అత్యధికంగా అంకుర సంస్థలు హైదరాబాద్‌లో వెలుస్తున్నాయని.. ఇలాంటి చరిత్ర ఉన్న భాగ్యనగరంలో మూసీకి ఒకపక్కన మాత్రమే అభివృద్ధి జరుగుతుండడమే దురదృష్టకరమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తెరాస ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కుటుంబ అభివృద్ధి తప్ప రాష్ట్రాభివృద్ధి వారికి పట్టదని విమర్శించారు. మజ్లిస్‌ పార్టీతో తెరాస చెలిమి చేస్తూ వాళ్లలాగే ఆలోచిస్తోందని మోదీ అన్నారు.
*ఉపాధి నిధుల వ్యయంలో ఏపీ రికార్డు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చరిత్రలోనే అత్యధికంగా 2018-19 ఏడాదికిగానూ ఆంధ్రప్రదేశ్‌ రూ.9216.46 కోట్లను వినియోగించుకుని రికార్డు సృష్టించినట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ సంచాలకుడు రంజిత్‌ బాషా తెలిపారు. కూలీలకు 24.64 కోట్ల పని దినాలను కల్పించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ నిధుల వినియోగంపై కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలున్నాయని పేర్కొన్నారు.
* ఖమ్మంలో అత్యధిక మెజారిటీ రావాలి: నామా
సంక్షేమ పథకాలను కేసీఆర్‌ అమలు చేసినట్లు గతంలో ఎవరూ చేయలేదని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ తెరాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నగరంలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో వేసవికాలంలో రాష్ట్రమంతా కరెంటు కోత ఉండేదని, పంట పొలాలకు విద్యుత్‌ లేక ఎండిపోయే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక అందరి అభిప్రాయాలకు విరుద్ధంగా 24 గంటలు విద్యుత్‌ ఇచ్చి చూపించారని చెప్పారు.
* పోలవరం చూసి మాట్లాడండి: దేవినేని
పోలవరంపై మోదీ వ్యాఖ్యలు దుర్మార్గమని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఏపీ జీవనాడిపై మరోసారి అక్కసు వెళ్లగక్కారని మండిపడ్డారు. పోలవరాన్ని మోదీ ఏటీఎంగా అభివర్ణించడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. మోదీ విమర్శలు తెలుగుజాతిపై దాడికి నిదర్శనమని అన్నారు. అమరావతిలో మంగళవారం దేవినేని విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘‘తెలంగాణ సమ్మతితో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చారు. ఈ హోదా విభజన ఇచ్చిన హక్కు తప్ప మోదీ దయాదాక్షిణ్యంతో వచ్చింది కాదు. ఏపీ జీవనాడి అయిన పోలవరంపై వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదు’’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ఏటీఎం కాదని.. నర్మదా ప్రాజెక్టు మోదీకి ఏటీఎం లాంటిదని వ్యాఖ్యానించారు. నర్మదా ప్రాజెక్టులో జరిగిన అవినీతితో ‘పచ్చ కామెర్ల..’ తరహాలో ప్రధానికి కనిపిస్తోందని విమర్శించారు.
* షర్మిల భద్రతా సిబ్బంది ఓవరాక్షన్‌
వైకాపా నాయకురాలు, జగన్‌ సోదరి షర్మిల బస్సు యాత్ర సందర్భంగా ఆమె భద్రతా సిబ్బంది ఓ యువకుడి పట్ల దురుసుగా ప్రవర్తించారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా కపిలేశ్వరపురం ఓ ద్విచక్ర వాహనంపైకి షర్మిల వెళుతున్న బస్సు దూసుకెళ్లింది. త్రుటిలో ఆ యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. యువకుడిని రక్షించాల్సింది పోయి భద్రతా సిబ్బంది అతిగా ప్రవర్తించారు. యువకుడి పై చేయి చేసుకుని పక్కకు నెట్టేశారు. స్థానిక యువకులు వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.