DailyDose

జన్‌ధన్ ఖాతాలో కోటి 70లక్షల జమ-వాణిజ్య-04/03

ec inquiry into jandhan deposits

????????????☘?????????☘???????????????☘????????????
* ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ జిల్లాలో 1,700 జన్ధన్ ఖాతాల్లో రూ.కోటీ 70లక్షల నగదు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో ఈ లావాదేవీలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తోంది ఎన్నికల సంఘం.
*ఇళ్లలో విలాసవంతమైన వంట గదులను రూపొందించి, నిర్మించే జర్మనీకి చెందిన నోల్టే తెలుగు రాష్ట్రాల్లో తన సేవలను ప్రారôభించింది. ఇందుకోసం అపర్ణా ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ సంస్థ అపర్ణా యూనీస్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
* ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ రుణ సంక్షోభంపై జరుపుతున్న విచారణలో భాగంగా, ఆ సంస్థ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ ఛైర్మన్‌ హరిశంకరన్‌ను తీవ్ర నేరాల పరిశోధనా కార్యాలయం అరెస్టు చేసింది. ‘ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో తనకు ఉన్న అధికారాలను శంకరన్‌ దుర్వినియోగం చేశారు.
* 2019లో అంతర్జాతీయ వృద్ధి రేటు తొలుత ఊహించిన దాని కంటే (జనవరిలో) ఇంకాస్త నెమ్మదించొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. అయితే రెండో అర్ధ భాగంలో మాత్రం అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ కాస్త పుంజుకొనే అవకాశం ఉందని వెల్లడించింది.
* హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్‌ సేవల సంస్థ అయిన సైయెంట్‌ లిమిటెడ్‌ షేర్‌ ధర ఒక్కరోజులోనే 10.80 శాతం పతనాన్ని నమోదు చేసింది.
* మార్చిలో బజాజ్‌ ఆటో మొత్తం 3,93,351 వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ అమ్మకాల (3,34,348)తో పోలిస్తే ఇది 18 శాతం మాత్రమే ఎక్కువ. మోటార్‌సైకిళ్ల విక్రయాలు 2,69,939 నుంచి 20 శాతం పెరిగి 3,23,538గా నమోదయ్యాయి.
* గతేడాది డిసెంబరుతో ముగిసిన ఏడాది కాలంలో అధిక శాతం లార్జ్‌ క్యాప్‌ ఈక్విటీ ఫండ్లు, ప్రభుత్వ బాండు ఫండ్లు నిరాశపరిచాయని ఒక నివేదిక పేర్కొంది. వాటి ప్రామాణిక సూచీలతో పోలిస్తే తక్కువ రాబడులు అందించినట్లు తెలిపింది.
* ‘మల్టిపుల్‌ మైలోమా’ అనే రకమైన కేన్సర్‌ వ్యాధిని అదుపు చేసేందుకు వినియోగించే రెవ్లీమిడ్‌ క్యాప్సూల్‌ విషయంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ లిమిటెడ్‌ యూఎస్‌లోని బయోటెక్నాలజీ కంపెనీ అయిన సెల్‌జీన్‌ తో రాజీ కుదుర్చుకుంది.
*బిగ్‌ డేటా, అనలిటిక్స్‌, కృత్రిమమేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వినియోగం పెరుగుతున్నందున, దేశీయ క్లౌడ్‌ విపణి 2022 నాటికి మూడింతలై 7.1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.49,000 కోట్ల) స్థాయికి చేరుతుందని నాస్‌కామ్‌ నివేదిక అంచనా వేసింది.
*ప్రముఖ జువెలరీ సంస్థ జోస్‌ ఆలుక్కాస్‌ తమ ప్రచారకర్తగా సినీనటి త్రిషను నియమించుకుంది. దక్షిణ భారత సినీ పరిశ్రమలో అద్భుతమైన నటనతో అనేక సంవత్సరాలుగా త్రిష అభిమానులకు చేరువయ్యారని, ఈ అభిమానం తమ బ్రాండ్‌ను వినియోగదారులకు మరింత చేరువ చేస్తుందని జోస్‌ ఆలుక్కాస్‌ విశ్వాసం వ్యక్తం చేసింది.
*ఈ ఏడాది మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 14 ముందస్తు పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)ల ద్వారా భారత కంపెనీలు 940 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.6,500 కోట్లు) సమీకరించాయి. ఎన్నికల తర్వాత ఐపీఓల దూకుడు పెరుగుతుందని ఈవై నివేదిక అంచనా వేసింది.
*రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) వరుసగా రెండో సారి పావు శాతం మేర రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం కిందకు దిగిరావడం; ఆర్థిక వృద్ధి మందగమనం పాలు కావడం ఇందుకు కారణాలవుతాయని వారు చెబుతున్నారు.
*విద్యుత్‌ కంపెనీలకు సుప్రీం కోర్టు తీర్పు ద్వారా ఊరట లభించింది. ఆర్‌బీఐ వెలువరచిన దివాలా సర్క్యులర్‌ను పక్కనపెట్టడం ఇందుకు నేపథ్యం. దీంతో జీఎమ్‌ఆర్‌, జీవీకే, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌తో పాటు పలు కంపెనీలు ఊపిరిపీల్చుకున్నాయి. మరో పక్క, బ్యాంకుల క్రెడిట్‌ రేటింగ్‌కు తాజా పరిణామం ప్రతికూలతలను తీసుకురావొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ అంటోంది.