అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడినట్లు తెలిసింది. 1996లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘భారతీయుడు’కు సీక్వెల్ ఇది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాజల్ కథానాయిక. ఈ సినిమా గురించి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడారు. సినిమా ఆగిపోలేదని చెప్పారు. చిత్రంలో రాజకీయాల గురించి చూపించబోతున్నారా?అని ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం నేను ఒక సినిమాలో నటిస్తున్నా. నా ఆలోచనలు ఇప్పుడు ప్రజలవైపునకు మళ్లాయి. సినిమాలో రాజకీయ సిద్ధాంతాలు ఉన్నాయా, లేవా అనేది దర్శకుడు నిర్ణయించాలి. ఆయనే చెప్పాలి’ అని కమల్ అన్నారు. రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో నటిస్తారా? అని విలేకరి ప్రశ్నించగా.. ‘ప్రజలు ఒక్కటై, వారికి సేవ చేయమని నన్ను అడిగితే.. సినిమాలు ఆపేస్తా. లక్షలాది అభిమానులను క్షమించమని కోరుతా. నేను చేయాల్సింది చాలా ఉంది. రాజకీయాలకు చాలా ఆలస్యంగా వచ్చా. కాబట్టి అన్నీ తొందరగా జరగాలి. సినిమాల్లో, రాజకీయాల్లో ఒకేసారి కొనసాగలేను’ అని విలక్షణ నటుడు అన్నారు. ఇటీవల ‘భారతీయుడు 2’ లుక్ టెస్ట్ గురించి శంకర్ మీడియాతో మాట్లాడారు. ‘కమల్‌కు ఇటీవల మేకప్ టెస్ట్ చేశాం. ఆయన్ను వృద్ధుడి గెటప్‌లో చూశాక ఒళ్లుగగుర్పొడిచింది. కమల్‌ను చూసి ప్రజలు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. నిజంగా ఇది ఓ గొప్ప అనుభూతి’ అని పేర్కొన్నారు.
ప్రజాసేవ ముందు ఇది ఆగక తప్పదు
Related tags :