Movies

టెర్మినేటర్-3

terminator 3 darkfate details

బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న చిత్రాల్లో ‘టెర్మినేటర్‌’ సిరీస్‌ ఒకటి. టెర్మినేటర్‌గా ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌నెగ్గర్‌ నటన, ఆయన చేసిన యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో ఆరో చిత్రం ‘టెర్మినేటర్‌: డార్క్‌ఫేట్‌’ రాబోతోంది. ఈ ఏడాది నవంబరు 1న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆర్నాల్డ్‌ పేర్కొన్నారు. అంతేకాదు, సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సైతం అభిమానులతో పంచుకున్నారు. టిమ్‌ మిల్లర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆర్నాల్డ్‌తో పాటు లిండా హామిల్టన్‌, డేవిస్‌, గాబ్రియల్‌ లునా, నటాలియా రేఐస్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేమ్స్‌ కామెరూన్‌ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.