Movies

జ్ఞాపకాలతో నిద్రపోతాం

i sleep with experiences anupama parameswaran

‘‘ఆ రోజంతా చేసిన పాత్ర.. దాని తాలూకు జ్ఞాపకాలతో రాత్రి నిద్రపోతాం. ఉదయం మరో కొత్త పాత్రకి సంబంధించిన ఊహలతో మేల్కొంటాం. నటుల జీవితాల్లో ప్రత్యేకత అదే’’ అంటోంది అనుపమ పరమేశ్వరన్‌. నటిగా ఈమధ్యే ప్రయాణం మొదలుపెట్టినా… దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ మెరుస్తోంది. ప్రతి చోటా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకొంది. నటిగా ఈ ప్రయాణంలో మీకు తరచుగా ఎదురయ్యే సవాల్‌ ఏమిటని అడిగితే… ‘‘ఒక పాత్ర ప్రభావం నుంచి బయటికొచ్చి, మరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం’’ అని చెప్పుకొచ్చిందామె. ‘‘ఒకొక్క రోజూ ఒక్కో పాత్రకి తగ్గట్టుగా మమ్మల్ని మేం మార్చుకుంటూ ప్రయాణం చేయాలి. పాత్రల స్వభావం రీత్యా మానసికంగా కూడా మారాలి. అది కష్టమైన పని. అంత కష్టాన్నీ సులభంగా అదొక దినచర్యలాగా నటులు చేస్తుంటారు. అందుకే వారంటే నాకు ప్రత్యేకమైన గౌరవం’’ అంది అనుపమ. ఆమె ‘రాక్షసుడు’ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి నటిస్తోంది.